తెలుగు న్యూస్  /  క్రికెట్  /  క్లైమాక్స్ ఫైట్.. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో లాస్ట్ టెస్టు.. ఓడితే సిరీస్ ఖ‌తం..ఓవ‌ల్‌లో భారత రికార్డు ఎలా ఉందంటే?

క్లైమాక్స్ ఫైట్.. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో లాస్ట్ టెస్టు.. ఓడితే సిరీస్ ఖ‌తం..ఓవ‌ల్‌లో భారత రికార్డు ఎలా ఉందంటే?

Published Jul 31, 2025 12:56 PM IST

google News
  • ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ లో క్లైమాక్స్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. నేటి నుంచే చివరిదైన అయిదో టెస్టు జరుగుతుంది. ఇందుకు లండన్ లోని ది ఓవల్ వేదిక. ఈ మ్యాచ్ ఓడితే ఇండియా సిరీస్ ఓడిపోతుంది. 
ఓవల్ మైదానం (PTI)

ఓవల్ మైదానం

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి పోరుకు వచ్చేసింది. గురువారం (జులై 31) ఓవల్ లో అయిదో టెస్టు ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లోనే ఈ పోరుకు తెరలేస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ పోతుంది. సిరీస్ ను సమం చేయాలంటే భారత్ ఈ టెస్టులో గెలవాల్సిందే.


వరుణుడి ముప్పు?

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత్ ఈ మ్యాచ్ కోసం బెటర్ గానే రెడీ అయింది. మాంచెస్టర్‌లో గత టెస్టులో గొప్ప ఫైటింగ్ స్పిరిట్ తో టీమ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆక్యూ వెదర్ ప్రకారం గురువారం నాడు ఉదయం మేఘావృతమైన ఆకాశంతో ప్రారంభమై మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 3-5 గంటల మధ్య ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. అక్కడ ఉదయం కూడా జల్లులు పడే అవకాశం ఉంది. దీని కారణంగా టాస్ ఆలస్యం కావచ్చు.

80 శాతం

రెండో రోజు అయిన శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. 3వ రోజు మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. గురువారం ఉరుములతో కూడిన జల్లుల గురించి యూకే వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. షెడ్యూల్ ప్రారంభానికి ముందు, సమయంలో 80% వర్షం కురిసే అవకాశం ఉన్నందున, టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రోజంతా 70-80% వర్షం పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకు నాలుగు టాస్‌లలో ఓడిపోయింది.

రికార్డు

భారత్ కు ఓవల్ లో మెరుగైన రికార్డు లేదు. ఇక్కడ ఇంగ్లాండ్ తో 14 మ్యాచ్ లు ఆడిన భారత్ అందులో ఏడింటిని డ్రా చేసుకుంది. కేవలం రెండు విజయాలను మాత్రమే ఖాతాలో వేసుకుంది. అవి 50 సంవత్సరాల గ్యాప్ తో వచ్చాయి. మొదటిది 1971 లో, రెండోది ఇటీవల 2021 లో విక్టరీలు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ రెండు అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 100 పరుగుల మొదటి ఇన్నింగ్స్ లోటును అధిగమించి, గెలిచిన భారత్ ఆ సిరీస్ లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో కుప్పకూలిన భారత్ ఈ మైదానంలో మొత్తం ఆరు పరాజయాలు చవిచూసింది.