తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India 2025 Full Schedule: 2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే.. ఛాంపియన్స్ ట్రోఫీ పాటు సిరీస్‍ల మ్యాచ్‍ల తేదీలు

Team India 2025 Full schedule: 2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే.. ఛాంపియన్స్ ట్రోఫీ పాటు సిరీస్‍ల మ్యాచ్‍ల తేదీలు

31 December 2024, 10:50 IST

google News
    • Team India 2025 Full schedule: 2025లో భారత జట్టు చాలా మ్యాచ్‍లను ఆడనుంది. ఈ ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టోర్నీలు ఉండనున్నాయి. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‍లు ఉంటాయి. ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.
Team India 2025 Full schedule: 2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే.. ఛాంపియన్స్ ట్రోఫీ పాటు సిరీస్‍ మ్యాచ్‍ల తేదీలు
Team India 2025 Full schedule: 2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే.. ఛాంపియన్స్ ట్రోఫీ పాటు సిరీస్‍ మ్యాచ్‍ల తేదీలు (AP)

Team India 2025 Full schedule: 2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే.. ఛాంపియన్స్ ట్రోఫీ పాటు సిరీస్‍ మ్యాచ్‍ల తేదీలు

2024 సంవత్సరం భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఒడిదొడుకుల మధ్య సాగింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీమిండియా సత్తాచాటింది. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడడం, సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‍లో వైట్‍వాష్‌కు గురి కావడం లాంటి ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది భారత్. నాలుగో టెస్టుతో ఈ ఏడాది ముగిసింది. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓడింది.

2024లో ఇలా..

2024లో భారత్ 15 టెస్టుల్లో ఎనిమిది గెలిచి, ఆరు ఓడింది. ఓ మ్యాచ్ డ్రా అయింది. ఈ ఏడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడగా.. శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది 26 టీ20లు ఆడిన భారత్ 24 మ్యాచ్‍ల్లో గెలిచింది. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలువడం ఈ ఏడాది గొప్ప విజయం.

2025లోనూ భారత పురుష క్రికెజ్ జట్టు బిజీబిజీగా ఉండనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్‍ జరగనున్నాయి. ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్ ప్రధానంగా ఉంది. అలాగే, మరిన్ని టెస్టు, వన్డే, టీ20 సిరీస్‍లు ఆడనుంది భారత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదో టెస్టుతో 2025ను మొదలుపెట్టనుంది. 2025 షెడ్యూల్ ఇక్కడ చూడండి.

2025లో భారత జట్టు పూర్తి షెడ్యూల్

భారత్ vs ఆస్ట్రేలియా - బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదో టెస్ట్ - జనవరి 3-7 (సిడ్నీ)

భారత్ vs ఇంగ్లండ్ (5 టీ20లు, 3 వన్డేలు) - జనవరి-ఫిబ్రవరి 2025

  • మొదటి టీ20: జనవరి 22 (చెన్నై)
  • రెండో టీ20: జనవరి 25 (కోల్‍కతా)
  • మూడో టీ20: జనవరి 28 (రాజ్‍కోట్)
  • నాలుగో టీ20: జనవరి 31 (పుణె)
  • ఐదో టీ20: ఫిబ్రవరి 2 (ముంబై)
  • తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‍పూర్)
  • రెండో వన్డే: ఫిబ్రవరి 9 (కటక్)
  • మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)

ఛాంపియన్స్ ట్రోఫీ - ఫిబ్రవరి-మార్చి 2025

  • భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)
  • భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
  • భారత్ vsన్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)
  • సెమీఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)
  • ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్) ఫైనల్ (అర్హత ఉంటే): మార్చి 9 (దుబాయ్)

 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్ (అర్హత సాధిస్తే) - జూన్ 2025 (లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్)

భారత్ vs ఇంగ్లండ్ (5 టెస్టులు) - జూన్-ఆగస్టు 2025 (ఇంగ్లండ్‍లో)

  • మొదటి టెస్టు: జూన్ 20-24 (హెడింగ్లే)
  • రెండో టెస్టు: జూలై 2-6 (ఎడ్జ్‌బాస్టన్)
  • మూడో టెస్టు: జూన్ 10-14 (లార్డ్స్)
  • నాలుగో టెస్టు: జూన్ 23-27 (మాంచెస్టర్)
  • ఐదో టెస్టు: జూన్ 31 - ఆగస్టు 4 (ఓవల్)

 

భారత్ vs బంగ్లాదేశ్ (3 వన్డేలు, 3 టీ20లు) - ఆగస్టు 2025 (బంగ్లాదేశ్‍లో..)

భారత్ vs వెస్టిండీస్ (2 టెస్టులు) - అక్టోబర్ - నవంబర్ 2025

ఆసియా కప్ (టీ20) - అక్టోబర్ - నవంబర్ 2025

భారత్ vs ఆస్ట్రేలియా (3 వన్డేలు, 5 టీ20లు): నవంబర్ 2025 (ఆస్ట్రేలియాలో..)

భారత్ vs దక్షిణాఫ్రికా (2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు): డిసెంబర్ 2025

తదుపరి వ్యాసం