తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 3rd Test: మూడో టెస్టు కోసం భారత యంగ్ పేసర్‌కు పిలుపు.. వాంఖడేలో అరంగేట్రం చేయనున్నాడా?

IND vs NZ 3rd Test: మూడో టెస్టు కోసం భారత యంగ్ పేసర్‌కు పిలుపు.. వాంఖడేలో అరంగేట్రం చేయనున్నాడా?

29 October 2024, 21:05 IST

google News
    • IND vs NZ 3rd Test: న్యూజిలాండ్‍తో మూడో టెస్టు కోసం భారత జట్టులోకి పేసర్ హర్షిత్ రాణా వచ్చేశాడు. వాంఖడేలో జరగనున్న టెస్టు కోసం సెలెక్టర్లు అతడిని జట్టులోకి యాడ్ చేశారు. దీంతో అతడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడనే అంచనాలు ఉన్నాయి.
IND vs NZ 3rd Test: మూడో టెస్టు కోసం భారత యంగ్ పేసర్‌కు పిలుపు.. అరంగేట్రం చేయనున్నాడా?
IND vs NZ 3rd Test: మూడో టెస్టు కోసం భారత యంగ్ పేసర్‌కు పిలుపు.. అరంగేట్రం చేయనున్నాడా? (PTI)

IND vs NZ 3rd Test: మూడో టెస్టు కోసం భారత యంగ్ పేసర్‌కు పిలుపు.. అరంగేట్రం చేయనున్నాడా?

న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత్ ఘోర ప్రదర్శన చేసింది. మూడు టెస్టుల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడి సిరీస్ చేజార్చుకుంది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‍లో ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. సిరీస్‍లో ఆఖరిదైన మూడో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ శుక్రవారం (నవంబర్ 1) షురూ కానుంది. ఈ టెస్టు కోసం భారత్ జట్టులోకి యంగ్ పేసర్ హర్షిత్ రాణా యాడ్ అయ్యాడు.

రంజీలో అదరగొట్టడంతో..

న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍కు ముందుగా ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. అయితే, రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‍ల కోసం టీమిండియా అతడిని రిలీజ్ చేసింది. దీంతో అతడు రంజీలో బరిలోకి దిగాడు. అసోంతో జరిగిన రంజీ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున ఏడు వికెట్లు పడగొట్టాడు హర్షిత్ రాణా. ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చి అర్ధ శకతం చేశాడు.

రంజీ మ్యాచ్‍లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపాక సెలెక్టర్లు నుంచి హర్షిత్ రాణాకు పిలుపు వచ్చింది. న్యూజిలాండ్‍తో మూడో టెస్టుకు భారత జట్టులోకి వచ్చేశాడు.

అరంగేట్రం చేస్తాడా?

న్యూజిలాండ్‍తో మూడో టెస్టుతో టీమిండియాలోకి హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అతడికి ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది చూడాలి. ఇప్పటికే సిరీస్ చేజారటంతో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షిత్ రాణాకు తుది జట్టులో ప్లేస్ దక్కే అవకాశం ఉండొచ్చు. నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మొదలవనుండటంతో.. బుమ్రాకు కివీస్‍తో మూడో టెస్టు నుంచి విశ్రాంతినివ్వొచ్చనే వాదనలు ఉన్నాయి. అలా జరిగితే హర్షిత్ రాణా అరంగేట్రం చేసే అవకాశం ఉండొచ్చు.

ఈనెలలోనే బంగ్లాదేశ్‍తో జరిగిన టీ20 సిరీస్‍కు హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్‍లోనూ తుదిజట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడు టీమిండియాలో అరంగేట్రం చేయలేకపోయాడు. మరి వాంఖడేలో జరిగే న్యూజిలాండ్‍తో మూడో టెస్టులో హర్షిత్ అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍కు కూడా హర్షిత్ ఎంపికయ్యాడు.

న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ అనూహ్యంగా చతికిలపడింది. బెంగళూరుతో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్నా.. చివరికి ఓటమి ఎదురైంది. ఇక స్పిన్‍కు అనుకూలించిన పుణెలోనూ రెండో టెస్టులో టీమిండియా ఓడిపోయింది. మూడు రోజుల్లోనే పరాజయం చెందింది. దీంతో 2-0తో వెనుకబడి సిరీస్ కోల్పోయింది. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ చేజార్చుకుంది.

వాంఖడేలో న్యూజిలాండ్‍తో నవంబర్ 1 నుంచి జరిగే మూడో టెస్టులో గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగ్గా ఉంచుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‍లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‍లోనైనా అదరగొడతాడనే ఆశతో భారత్ ఉంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍కు ముందు మళ్లీ హిట్‍మ్యాన్ ఫామ్‍లోకి రావాలని ఆకాంక్షిస్తోంది.

తదుపరి వ్యాసం