Gambhir on KL Rahul: ‘వారి ఆలోచనలు ముఖ్యం కాదు’: కేఎల్ రాహుల్‍కే గంభీర్ మద్దతు.. రెండో టెస్టు తుదిజట్టుపై ఉత్కంఠ
23 October 2024, 13:48 IST
- Gautam Gambhir on KL Rahul: న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో విఫలమైన కేఎల్ రాహుల్‍కు మద్దతుగా మాట్లాడాడు టీమిండియా హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్. దీంతో రెండో టెస్టు తుదిజట్టుపై ఉత్కంఠ నెలకొంది. అలాగే, రిషబ్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని గౌతీ చెప్పాడు.
Gambhir on KL Rahul: ‘వారి ఆలోచనలు ముఖ్యం కాదు’: కేఎల్ రాహుల్‍కే గంభీర్ మద్దతు.. రెండో టెస్టు తుదిజట్టుపై ఉత్కంఠ
న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన భారత్.. రెండో పోరుకు రెడీ అయింది. మూడు టెస్టుల సిరీస్‍లో రెండో మ్యాచ్ రేపు (అక్టోబర్ 24) పుణె వేదికగా మొదలుకానుంది. తొలి టెస్టులో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో 12 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో రెండో టెస్టుకు భారత తుది జట్టులో రాహుల్‍ను తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వస్తున్నాయి.
రాహుల్‍కు గంభీర్ సపోర్ట్
భారీ స్కోర్లు చేసే సామర్థ్యం కేఎల్ రాహుల్‍కు మెండుగా ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు. రెండో టెస్టు జరగనున్న తరుణంలో నేడు మీడియా సమావేశం అతడు మాట్లాడాడు. టీమిండియా మేనేజ్‍మెంట్ రాహుల్‍ను సపోర్ట్ చేస్తుందని అన్నాడు. బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో కాన్పూర్ వేదికగా రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు చేసిన విషయాన్ని గౌతీ గుర్తు చేశాడు.
వారి ఆలోచనలు పట్టించుకోం
సోషల్ మీడియాలో జనాలు, నిపుణులు ఏం ఆలోచిస్తున్నారో అసలు ముఖ్యం కాదని గౌతమ్ గంభీర్ చెప్పాడు. సోషల్ మీడియాలో రాహుల్‍పై వస్తున్న విమర్శలను పట్టించుకోబోమనేలా మాట్లాడాడు. “తుది జట్టును సోషల్ మీడియా నిర్ణయించదు. సోషల్ మీడియా, నిపుణులు ఏం ఆలోచిస్తున్నారో మఖ్యం కాదు. టీమ్ మేనేజ్‍మెంట్ ఏమనుకుంటుందో అది ముఖ్యం. కఠినమైన కన్పూర్ పిచ్‍పై (బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో) అతడు (రాహుల్) మంచి బ్యాటింగ్ చేశాడు. అతడు భారీ స్కోర్లు చేయాలని అనుకుంటున్నాడు. అతడికి మద్దతు ఇచ్చేందుకే టీమ్ మేనేజ్‍మెంట్ ఆలోచిస్తోంది” అని గంభీర్ చెప్పాడు.
ఇంకా నిర్ణయించలేదు
న్యూజిలాండ్‍తో రెండో టెస్టు కోసం భారత తుది జట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంభీర్ చెప్పాడు. రేపు ఈ తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తుది జట్టుపై టెన్షన్
కేఎల్ రాహుల్‍కు గంభీర్ మద్దతుగా మాట్లాడటంతో రెండో టెస్టులో భారత తుదిజట్టుపై ఉత్కంఠ పెరిగింది. తొలి టెస్టుకు దూరమైన యంగ్ ఓపెనర్ శుభ్‍మన్.. ఈ రెండో మ్యాచ్‍కు సిద్ధమయ్యాడు. అతడి స్థానంలో తొలి టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (150) అద్భుతమైన సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. దీంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్‍ను కొనసాగించి.. రాహుల్ స్థానంలో గిల్ వస్తాడనే అంచనాలు వచ్చాయి.
అయితే, రాహుల్‍కు గంభీర్ సపోర్ట్ ఇచ్చాడు. మరి, రాహుల్ ఉండాలనుకుంటే సెంచరీ వీరుడు సర్ఫరాజ్‍ను తప్పిస్తారా.. లేకపోతే గిల్‍నే పక్కన పెడతారా అనే టెన్షన్ ఉంది. మొత్తంగా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు న్యూజిలాండ్‍తో రెండు, మూడు టెస్టుల కోసం ఆల్‍రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా జట్టులోకి చేర్చారు సెలెక్టర్లు. ఒకవేళ అతడికి తుదిజట్టులోకి తీసుకోవాలంటే ఎవరిని తప్పిస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది.
పంత్ పూర్తిగా ఫిట్
తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలికి దెబ్బ తగిలింది. దీంతో ఈ మ్యాచ్‍లో బ్యాటింగ్ చేసినా.. వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు. అయితే, ప్రస్తుతం పంత్ ఫుల్ ఫిట్ అయ్యాడని, రెండో టెస్టులో వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని గంభీర్ వెల్లడించాడు.