తెలుగు న్యూస్  /  career  /  Epfo Eo/ao Final Result: యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల

EPFO EO/AO Final Result: యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల

Sudarshan V HT Telugu

03 January 2025, 21:50 IST

google News
  • EPFO EO/AO Final Result: యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ ఫైనల్ రిజల్ట్ 2024 విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ చెక్ చేయడానికి యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ను చూడవచ్చు.

యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల
యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల

యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ ఫైనల్ రిజల్ట్ 2024ను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

డిసెంబర్లో ఇంటర్వ్యూలు

2024 జూలై 2న ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ (employee provident fund) రిక్రూట్మెంట్ టెస్ట్, 2024 నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఈపీఎఫ్ఓలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 418 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరైన అభ్యర్థులందరూ తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోండి..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ లకు హాజరైన అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • యూపీఎస్సీ (upsc recruitment) అధికారిక వెబ్సైట్ upsc.gov.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఈవో/ఏఓ ఫైనల్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకునేందుకు వీలుగా కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని భద్రపర్చండి.

30 రోజుల్లో మార్కుల వివరాలు

నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదా 30 రోజుల్లోగా అభ్యర్థులందరికీ మార్కుల వివరాలను కమిషన్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

తదుపరి వ్యాసం