తెలుగు న్యూస్  /  career  /  Tcs Free Course : మీ కెరీర్​ డెవలప్​మెంట్​ కోసం టీసీఎస్​ కొత్త కోర్సు- ఉచితంగా చాలా నేర్చుకోవచ్చు!

TCS free course : మీ కెరీర్​ డెవలప్​మెంట్​ కోసం టీసీఎస్​ కొత్త కోర్సు- ఉచితంగా చాలా నేర్చుకోవచ్చు!

Sharath Chitturi HT Telugu

Updated Dec 10, 2024 10:46 AM IST

google News
  • TCS free course : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 15 రోజుల ఉచిత డిజిటల్ సర్టిఫికేషన్ కోర్సును అందిస్తూ, విద్యార్థులకు అవసరమైన కోర్ ఎంప్లాయిబిలిటీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతోంది. ఈ కోర్సు జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కెరీర్​ డెవలప్​మెంట్​ కోసం టీసీఎస్​ ఉచిత కోర్సు.. (Pixabay)

కెరీర్​ డెవలప్​మెంట్​ కోసం టీసీఎస్​ ఉచిత కోర్సు..

టెక్నాలజీ, ట్రెండ్స్​లో తాజా పరిణామాలకు అనుగుణంగా జాబ్ మార్కెట్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో వృత్తిపరమైన పనిలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడానికి సహాయపడే కోర్ ఎంప్లాయిబిలిటీ నైపుణ్యాలను కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్లు తమ కమ్యూనికేషన్ స్కిల్స్, సహకారం, ఫైనాన్షియల్, డిజిటల్ లిటరసీ స్కిల్స్ జాబ్ మార్కెట్ డిమాండ్ చేసే అంశాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టీసీఎస్ ఐఓఎన్ కెరీర్ ఎడ్జ్ - యంగ్ ప్రొఫెషనల్ పేరుతో 15 రోజుల ఉచిత డిజిటల్ సర్టిఫికేషన్ కోర్సును విద్యార్థులకు అందిస్తోంది. ఈ కోర్సు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టీసీఎస్​ ఫ్రీ కోర్సు వివరాలు..

కెరీర్ ప్రిపేర్డ్​నెస్ కోర్సు జాబ్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉన్న చాలా అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కోర్సు ద్వారా విద్యార్థులు వారి కెరీర్​లో వారి ఉత్తమ స్థాయికి వెళ్లవచ్చు.

అధికారిక వెబ్​సైట్ ప్రకారం ఈ కోర్సులో పాల్గొనేవారు వీటి గురించి నేర్చుకుంటారు:

  • పనిప్రాంతంలో స్నేహాన్ని పెంపొందించడానికి ప్రవర్తనా నైపుణ్యాలు
  • ప్రభావాన్ని సృష్టించడం కోసం ప్రజంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్
  • బలమైన ప్రొఫైల్ విజిబిలిటీని ఇచ్చే సమర్థవంతమైన రెజ్యూమ్​లను సృష్టించడం
  • కార్పొరేట్ నేపధ్యంలో బిజినెస్​ ఎటిక్విటీ
  • ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఐటీ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్

కోర్సులోని 15 మాడ్యూల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • ప్రజంటేషన్ నైపుణ్యాలు
  • సాఫ్ట్ స్కిల్స్
  • కెరీర్ గైడెన్స్ ఫ్రేమ్ వర్క్
  • రెజ్యూమ్ రైటింగ్
  • గ్రూప్ డిస్కషన్ స్కిల్స్
  • ఇంటర్వ్యూ నైపుణ్యాలు
  • బిజినెస్​ ఎటిక్విటి
  • సమర్థవంతమైన ఈమెయిల్ రైటింగ్
  • టెలిఫోన్ ఎటిక్విటీ
  • అకౌంటింగ్ ఫండమెంటల్స్
  • ఐటీ ఫౌండేషన్ నైపుణ్యాలు
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్​వ్యూ 1*(మూలం: NPTEL)
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్​వ్యూ 2*(మూలం: NPTEL)
  • అసెస్​మెంట్​

అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ టీసీఎస్​ కోర్సులో అనుబంధ వీడియోలు, కేస్ స్టడీస్, సెల్ఫ్-పేస్డ్ ఈ-లెర్నింగ్ కంటెంట్ అభ్యాస పద్ధతులుగా ఉంటాయి.

ఈ 15 రోజుల కోర్సు ద్వారా డిజిటల్​ సర్టిఫికేషన్​ని కూడా పొందొచ్చు. ఇది మీ రెజ్యూమ్​కి ఒక యాడెడ్​ అడ్వాంటేజ్​ అవుతుంది. ఆన్​లైన్​ కోర్సు కాబట్టి, మీరు మీ ఫ్రీ టైమ్​లో కూడా పూర్తి చేేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్​ని సందర్శించవచ్చు.

తదుపరి వ్యాసం