తెలుగు న్యూస్  /  career  /  Sbi Sco Recruitment 2025 : ఎస్బీఐలో స్పెషలిస్ట్​ కేడర్​ ఆఫీసర్​ పోస్టులు- రిక్రూట్​మెంట్​ ప్రక్రియ షురూ..

SBI SCO Recruitment 2025 : ఎస్బీఐలో స్పెషలిస్ట్​ కేడర్​ ఆఫీసర్​ పోస్టులు- రిక్రూట్​మెంట్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu

Published Jan 04, 2025 10:08 AM IST

google News
  • SBI SCO Recruitment 2025: ఎస్బీఐ స్పెషలిస్ట్​ కేడర్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. ఎలా అప్లై చేసుకోవాలి? అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్​మెంట్​ 2025 వివరాలు.. (REUTERS)

ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్​మెంట్​ 2025 వివరాలు..

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అలర్ట్​! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో భాగంగా సంస్థలో 150 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ.

జనవరి 3న ప్రారంభమైన ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 జనవరి 23న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక విధానంతో పాటు ఇతర వివరాల కోసం కింద చదవండి..

ఎస్బీఐ రిక్రూట్​మెంట్​ 2025..

విద్యార్హత..

ఎస్బీఐ ఎస్​సీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా అనుసంధాన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగం) పూర్తి చేసి, ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్​లో సర్టిఫికేట్ (సర్టిఫికేట్ తేదీ 31.12.2024 నాటికి ఉండాలి) పొంది ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియలో షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. కేవలం ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికకు మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు (కటాఫ్ పాయింట్ వద్ద కామన్ మార్కులు) సాధిస్తే, అలాంటి అభ్యర్థులకు మెరిట్​లో వారి వయస్సును బట్టి ర్యాంకులు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి.

దరఖాస్తు ఫీజు..

ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్​మెంట్​ 2025 కోసం.. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు.

డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్​పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆన్​లై పేమెంట్​కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అభ్యర్థులే భరించాలి.

ఎలా అప్లై చేసుకోవాలి?

  • sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో లభ్యమయ్యే కెరీర్స్ లింక్​పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు కరెంట్ ఓపెనింగ్స్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్మెంట్ 2025 లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఆన్​లైన్ లింక్ వెబ్సైట్​లో అందుబాటులో ఉంటుంది.
  • రిజిస్టర్ చేసుకుని అకౌంట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోవాలి.

వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్బీఐ ఎస్​సీఓ రిక్రూట్​మెంట్​కి అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం