తెలుగు న్యూస్  /  career  /  Railway Jobs Qualifications: రైల్వే ల్లో గ్రూప్ డీ లేదా లెవెల్ 1 పోస్ట్ ల విద్యార్హతలను సడలించిన రైల్వే బోర్డు

Railway jobs qualifications: రైల్వే ల్లో గ్రూప్ డీ లేదా లెవెల్ 1 పోస్ట్ ల విద్యార్హతలను సడలించిన రైల్వే బోర్డు

Sudarshan V HT Telugu

03 January 2025, 19:17 IST

google News
  • Railway jobs qualifications: రైల్వేల్లో లెవెల్ -1 (గతంలో గ్రూప్ డి) పోస్టుల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత నిబంధనలను రైల్వే బోర్డు సడలించింది. గతంలో రైల్వేల్లో గ్రూప్ డీ లేదా లెవెల్ 1 ఉద్యోగాల కోసం కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సాంకేతిక విద్యలో సర్టిఫికెట్ అవసరం ఉండేది.

రైల్వే ల్లో లెవెల్ 1 పోస్ట్ ల విద్యార్హతలను సడలించిన రైల్వే బోర్డు
రైల్వే ల్లో లెవెల్ 1 పోస్ట్ ల విద్యార్హతలను సడలించిన రైల్వే బోర్డు (Representative image)

రైల్వే ల్లో లెవెల్ 1 పోస్ట్ ల విద్యార్హతలను సడలించిన రైల్వే బోర్డు

Railway jobs qualifications: లెవెల్ -1 (గతంలో గ్రూప్ డి) పోస్టుల భర్తీకి కనీస విద్యార్హత నిబంధనలను రైల్వే బోర్డు సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ (NAC) ఉన్నవారు లెవల్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే, పైన పేర్కొన్న మూడు విద్యార్హతల్లో ఐదైనా ఒక అర్హత ఉన్నవారు రైల్వేలో గ్రూప్ డీ లేదా లెవెల్ 1 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

రైల్వే బోర్డులకు సమాచారం

గతంలో సాంకేతిక విభాగాలకు అప్లై చేసే దరఖాస్తుదారుడు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండడంతో పాటు న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉండటం తప్పనిసరిగా ఉండేది. కొత్త నిబంధనలకు సంబంధించి జనవరి 2న అన్ని రైల్వే జోన్లకు బోర్డు నుంచి లిఖిత పూర్వక సమాచారం అందిందని, ఈ విషయాన్ని సమీక్షించామని, గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. "లెవల్ -1 పోస్టులలో భవిష్యత్తులో జరిగే అన్ని నియామకాలకు కనీస విద్యార్హత 10 వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటిఐ లేదా తత్సమాన లేదా ఎన్సివిటి మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ (ఎన్ఎసి) ఉండాలి’’ అని బోర్డు నిర్ణయించింది.

లెవెల్ 1 లో పోస్ట్ లు

భారతీయ రైల్వేలో లెవల్-1 పోస్టుల్లో వివిధ విభాగాలకు సహాయకులు, పాయింట్ మెన్, ట్రాక్ మెయింటెయినర్లు ఉన్నాయి. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (rrb) లెవెల్ -1 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

తదుపరి వ్యాసం