తెలుగు న్యూస్  /  career  /  Cbse Job Notification: సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

CBSE Job Notification: సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Published Jan 21, 2025 01:59 PM IST

google News
    • CBSE Job Notification: సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణలో సీబీఎస్‌ఈ కీలకంగా ఉంది. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ బోర్డు గుర్తించిన పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని సీబీఎస్‌ఈ పర్యవేక్షిస్తోంది. 
సీబీఎస్‌ఈ బోర్డులో ఉద్యోగాలకు నోటిపికేషన్

సీబీఎస్‌ఈ బోర్డులో ఉద్యోగాలకు నోటిపికేషన్

CBSE Job Notification: సీబీఎస్‌ఈలో గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన పాఠశాలలకు వార్షిక పరీక్షల నిర్వహణలో సీబీఎస్‌ఈ కీలకంగా వ్యవహరిస్తోంది సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, బోర్డు కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన పలు ఉద్యోగ నియామకాల కోసం తాజా నోటిఫికేషన్‌ విడుదలైంది.

జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల ద్వారా గ్రూప్‌ బీ, గ్రూప్ సీ ఉద్యోగ నియామకాల చేపడతారు. గ్రూప్‌ బీ క్యాటగిరీలో సూపరింటెండెంట్‌ పే లెవల్ 6 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 142 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో ఎస్సీలకు 21 పోస్టులు, ఎస్టీలకు 10, బీసీలకు 38, ఈడబ్యూఎస్‌క 14, అన్‌ రిజర్వ్‌డ్‌ విభాగంలో 59 పోస్టులు ఉన్నాయి. వికలాంగులకు 6 పోస్టులను కేటాయించారు. మొత్తం గ్రూప్ బీ విభాగంలో 142 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

గ్రూప్‌ సీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌ పే లెవల్ 2 క్యాటగిరీలో 70 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇందులో ఎస్సీ విభాగంలో 9, ఎస్టీ విభాగంలో 9, ఓబీసీలో 34, ఈడబ్ల్యూఎస్‌లో 13, జనరల్‌లో 5 పోస్టులు ఉన్నాయి. దివ్యాంగులక 2, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌క 7 కేటాయించారు.

జనవరి 2వ తేదీ నుంచి 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ప్రమానాలు, వయో పరిమితిలో సడలింపు, పరీక్ష రుసుము, పే స్కేల్ వివరాలు, ఎంపిక పరీక్ష నిర్వహించే కేంద్రాలు, పరీక్షల సిలబస్‌, ఎంపిక విధానం కోసం నోటిఫికేషన్ చూడండి. మరిన్ని వివరాలకు https://cbse.gov.in సైట్‌ను సందర్శించండి.

సీబీఎస్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ కోసం ఈ లింకును అనుసరించండి.

తదుపరి వ్యాసం