తెలుగు న్యూస్  /  career  /  Krishna District : మహిళా, శిశు అభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు డిసెంబర్ 7 చివరి తేదీ

Krishna District : మహిళా, శిశు అభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు డిసెంబర్ 7 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu

29 November 2024, 14:40 IST

google News
    • కృష్ణా జిల్లా పరిధిలో మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు  డిసెంబ‌ర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు
కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు

కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు

కృష్ణా జిల్లాలో మ‌హిళ‌, శిశు అభివృద్ధి, సాధికారిత శాఖ‌లో మిష‌న్ వాత్స‌ల్య స్కీం, మిష‌న్ శ‌క్తి, మిష‌న్ సాక్ష్యం విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ ర‌కాల 14 పోస్టుల‌ను భర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు డిసెంబ‌ర్ 7 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్, అవుట్ సోర్సింగ్‌ ప్రాతిపదిక‌న భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం 14 పోస్టులు

మొత్తం 14 పోస్టులున్నాయి. మిష‌న్ వాత్స‌ల్య‌లో అవుట్ రీచ్ వ‌ర్క‌ర్‌-1, మేనేజ‌ర్‌, కో ఆర్డినేట‌ర్ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1, డాక్ట‌ర్ -1, ఆయా (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1, చౌకిదార్‌ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1, కుక్‌ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1, హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1 పోస్టు ఉన్నాయి. ఇక పీటీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కం యోగా ట్రైన‌ర్ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)-1, విద్యావేత్త (కేవ‌లం మ‌హిళ‌ల‌కు)-1, మిష‌న్ శ‌క్తిలో పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్ (మ‌హిళ‌)-1, సెక్యూరిటీ గార్డ్‌, నైట్ గార్డ్‌-3, మిష‌న్ సాక్యంలో బ్లాక్ కో ఆర్డినేట‌ర్-1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కుక్‌, హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్ పోస్టులు అవుట్ సోర్సింగ్‌, డాక్ట‌ర్, పీటీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కం యోగా ట్రైన‌ర్, విద్యావేత్త పోస్టులు పార్ట్‌టైం, మిగిలిన పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు.

నెల వేత‌నం

నెల‌వారీ వేత‌నం ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంది. అవుట్ రీచ్ వ‌ర్క‌ర్‌కు రూ.10,592, మేనేజ‌ర్‌, కో ఆర్డినేట‌ర్ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే)కు రూ.23,170, డాక్ట‌ర్‌కు రూ.9,930, ఆయాకు రూ.7,944, చౌకిదార‌కు రూ.7,944, కుక్‌కు రూ.9,930, హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్‌కు రూ.7,944, పీటీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కం యోగా ట్రైన‌ర‌కు రూ.10,000, విద్యావేత్తకు రూ.10,000, మిష‌న్ శ‌క్తిలో పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌కు రూ.19,000, సెక్యూరిటీ గార్డ్‌, నైట్ గార్డ్‌కు రూ.15,000, మిష‌న్ సాక్యంలో బ్లాక్ కో ఆర్డినేట‌ర్‌కు రూ.20,000 ఉంటుంది.

అర్హతలు…

1. అవుట్ రీచ్ వ‌ర్క‌ర్ పోస్టుకు - ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించాలి. మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ తో పాటు అనుభ‌వం ఉండాలి.

2. మేనేజ‌ర్‌, కో ఆర్డినేట‌ర్ పోస్టుకు - సోష‌ల్ వ‌ర్క్‌, సైకాల‌జీ, హోం సైన్స్‌ల్లో పీజీ చేయాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ఇంట‌ర్‌నెట్ ఉప‌యోగించ‌గ‌ల సామర్థ్యం ఉండాలి.

3. డాక్ట‌ర్ పోస్టు - ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రాక్ట్రీస్ చేస్తుండాలి.

4. ఆయా పోస్టుకు ఎటువంటి విద్యా అర్హ‌త లేదు. కాక‌పోతే మంచి అనుభ‌వం ఉండాలి.

5. చౌకిదార పోస్టుకు మ‌ద్యం సేవించ‌డం, గుట్కా వంటి వ్య‌స‌నాలు ఉండ‌కూడాదు.

6. కుక్ పోస్టుకు అనుభ‌వం ఉండాలి.

7. హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్ పోస్టుకు అనుభ‌వం ఉండాలి. మంచి ట్రాక్ రికార్డు ఉండాలి.

8. పీటీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కం యోగా ట్రైన‌ర పోస్టుకు యోగా శిక్ష‌ణ పూర్తి చేసిన‌ట్లు స‌ర్టిఫికేట్ ఉండాలి.

9. విద్యావేత్త పోస్టుకు డీఈడీ, బీఈడీ చేసి ఉండాలి. టెట్ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

10. పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్ పోస్టుకు పారా మెడిక‌ల్‌లో డిగ్రీ, డిప్లొమా ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి.

11. సెక్యూరిటీ గార్డ్‌, నైట్ గార్డ్ పోస్టుల‌కు క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. రిటైర్డ్ మిలిట‌రీ, పారా మిలిట‌రీ సిబ్బంది

12. బ్లాక్ కో ఆర్డినేట‌ర్ పోస్టుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్లు అనుభ‌వం ఉండాలి. స్థానిక భాష‌లో మంచి మౌఖిక, రాయ‌డం రావాలి.

అప్లికేష‌న్‌ను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్రింట్ తీసుకుని, ద‌ర‌ఖాస్తు ఖాళీల‌ను పూర్తి చేయాలి. సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలను గ‌జిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేసి ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాలి.

ద‌ర‌ఖాస్తును డిసెంబ‌ర్ 7 సాయంత్రం 5 గంట‌ల లోపు జిల్లా మ‌హిళ మ‌రియు శిశు సంక్షేమ, సాధ‌ధ‌ఙ‌కారిత అధికారిణి కార్యాల‌యం, డోర్ నెంబ‌ర్ 93-6, ఉమా శంక‌ర్ న‌గ‌ర్ మొద‌టి లైన్‌, ఎస్.ఎస్.ఆర్ అకాడ‌మీ, కానూరు, కృష్ణా జిల్లాకు పంపాలి. అద‌న‌పు స‌మాచారం కోసం 8977675206, 9951513727, 8464920702 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్రదించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

 

తదుపరి వ్యాసం