తెలుగు న్యూస్  /  career  /  Tg Common Entrance Tests 2025 : తెలంగాణలో ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు - ఏప్రిల్‌ 29 నుంచి ఎంసెట్, ముఖ్య వివరాలివే

TG Common Entrance Tests 2025 : తెలంగాణలో ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు - ఏప్రిల్‌ 29 నుంచి ఎంసెట్, ముఖ్య వివరాలివే

15 January 2025, 15:10 IST

google News
    • TS Common Entrance Tests 2025 : ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు తేదీలు వచ్చేశాయ్. ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌(ఎంసెట్) ఉంటుందని ప్రకటించింది. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌, జూన్ 6న లాసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయని తెలిపింది.
తెలంగాణలో ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు
తెలంగాణలో ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణలో ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు

ఈ ఏడాది నిర్వహించబోయే పలు ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌(ఎంసెట్) పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్) ఎగ్జామ్స్ ఉంటాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్) ఎగ్జామ్స్ ఉండనున్నాయి.

ఎంట్రెన్స్ పరీక్షలు - ముఖ్య తేదీలు

  • ఈఏపీసెట్ - ఏప్రిల్ 29, 30, 2025(అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్)
  • ఈఏపీసెట్ - మే 2 నుంచి 5, 2025 ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్).
  • ఈసెట్ - మే 12, 2025
  • ఎడ్ సెట్ - జూన్ 1, 2025
  • లాసెట్ - జూన్ 6 2025
  • ఐసెట్ - జూన్ 8, 9, 2025
  • పీజీఈసెట్ జూన్ 16 - 19, 2025.

ఇక గత డిసెంబర్ నెలలోనే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించిన సంగతి తెలిసిందే. జేఎన్‌టీయూ హెచ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈఏపీసెట్‌కి కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి.డీన్ కుమార్, పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అరుణ కుమారిలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్ జరగనుంది. దీనికి కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువల రవిని నియమించింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్‌ నిర్వహించనున్నారు. ఇందుకు పి.చంద్రశేఖర్‌ని కన్వీనర్ గా నియమించగా… లాసెట్‌, పీజీఎల్ సెట్‌లకు బి.విజయలక్ష్మిని కన్వీనర్‌గా నియమించింది.

టీజీఎడ్ సెట్ ను కాకతీయ వర్సిటీ నిర్వహించనుంది. దీనికి ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డిని కన్వీనర్ గా నియమించింది. ఇక పాలమూరు వర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్న పీఈసెట్‌కి ఎన్‌.ఎస్‌ దిలీప్‌ని కన్వీనర్‌గా నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు ఇచ్చింది.

తాజాగా పరీక్ష తేదీలను కూడా ఖరారు చేయటంతో… ప్రవేశ పరీక్షల ప్రక్రియ వేగవంతం అవ్వనుంది. త్వరలోనే ఆయా సెట్ల కన్వీనర్లు… ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇందులో దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీలు, కౌన్సిలింగ్ ప్రక్రియ, సీట్ల కేటాయింపు వంటి వివరాలను ప్రకటిస్తారు.

తదుపరి వ్యాసం