తెలుగు న్యూస్  /  career  /  Cbse Exams 2025 : సీబీఎస్​ఈ పరీక్షల్లో జెల్​ పెన్​ వాడొచ్చా? అక్షర దోషాలకు మార్కులు కట్​ చేస్తారా?

CBSE exams 2025 : సీబీఎస్​ఈ పరీక్షల్లో జెల్​ పెన్​ వాడొచ్చా? అక్షర దోషాలకు మార్కులు కట్​ చేస్తారా?

Sharath Chitturi HT Telugu

Published Feb 10, 2025 06:40 AM IST

google News
    • CBSE FAQs : మీరు సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారా? పరీక్షకు ముందు మీ సందేహాలను నివృత్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన ఎఫ్​ఏక్యూలు, వాటి సమాధానాలను ఇక్కడ చెక్​ చేసుకోండి..
సీబీఎస్​ఈ ఎఫ్​ఏక్యూలు ఇవి.. కచ్చితంగా తెలుసుకోండి..

సీబీఎస్​ఈ ఎఫ్​ఏక్యూలు ఇవి.. కచ్చితంగా తెలుసుకోండి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 2025 ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షలకు వారం రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉండడంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్​లో మరింత ఫోకస్​ చేసారు. అయితే ఎగ్జామ్స్​కి ముందు విద్యార్థులకు ముఖ్యమైన సందేహాలు రావడం సహజం. ఉదాహరణకు పద పరిమితి దాటితే మార్కులు తగ్గిస్తారా? లేదా, తుది ఫలితాల్లో ప్రీ-బోర్డ్ మార్కులు ఉంటాయా? వంటివి కొన్ని సాధారణ సందేహాలు. విద్యార్థులకు సులభతరం చేయడానికి, cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్​సైట్​లో ఇచ్చిన 10 ముఖ్యమైన ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు), బోర్డు అందించే సూచనలు/ సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..

1. మంచి ప్రజెంటేషన్​కి ఏమైనా మార్కులు ఇస్తారా?

సీబీఎస్ఈ ప్రకారం ప్రజెంటేషన్​కి ప్రత్యేక మార్కులు ఇవ్వనప్పటికీ, సమాధానాలు నీట్​గా, ముఖ్యమైన అంశాలతో చక్కగా ఆర్గనైజ్​డ్​గా ఉండాలని సిఫార్సు చేశారు.

2. ప్రీ-బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయితే బోర్డు పరీక్షకు హాజరు కాలేరా?

బోర్డు ప్రకారం, ప్రీ-బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శన.. సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 బోర్డు పరీక్షకు ఎంత బాగా సన్నద్ధమయ్యారో తెలుసుకోవడానికి సహాయపడతాయి. పరీక్ష రాసేందుకు అర్హత ఉంటే బోర్డు పరీక్షకు హాజరుకాకుండా ఒక విద్యార్థిని అడ్డుకోలేరు.

3. సిలబ్​ మొత్తాన్ని చాలా మంది 2-3సార్లు రివైజ్​ చేస్తున్నారు. నేను చేయలేదని భయంగా ఉంది. ఎలా?

ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయాందోళనకు గురికావద్దని, కేవలం ప్రిపరేషన్ పైనే దృష్టి పెట్టాలని బోర్డు సూచిస్తోంది. రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలిని, దాన్ని ఫాలో అవ్వాలని చెబుతోంది.

4. బోర్డు పరీక్షల్లో ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారా?

ప్రీ-బోర్డ్ పరీక్షలో పొందిన మార్కులు సీబీఎస్​ఈ బోర్డు పరీక్ష మార్కులకు యాడ్​ అవ్వవు.

5. బోర్డు పరీక్షల్లో వైట్​నర్స్​, జెల్ పెన్నులకు అనుమతి ఉందా?

బోర్డు పరీక్షలో వైట్​నర్ ఉపయోగించడానికి అనుమతి లేదు. కాగా విద్యార్థులు నీలం లేదా రాయల్ బ్లూ ఇంక్ జెల్ పెన్నులను ఉపయోగించవచ్చు.

6. లాంగ్వేజ్ పేపర్లలో పద పరిమితి, అక్షర దోషాలకు మార్కుల కోత విధిస్తారా?

సీబీఎస్ ఈ ప్రకారం పద పరిమితి దాటితే ఎలాంటి మార్కులను కట్​ చేయరు. అయితే, సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 బోర్డు పరీక్షల్లో అక్షర దోషాలు, ఇతర తప్పులకు లాంగ్వేజ్ పేపర్లలో మార్కుల కోత ఉంటుంది.

7. బోర్డు నమూనా పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారా?

సీబీఎస్​ఈ శాంపిల్​ ప్రశ్నపత్రాలు విద్యార్థులకు ప్రశ్నల రూపకల్పన, ఐడియా తెలుసుకోవడానికి మాత్రమే సహాయపడతాయని బోర్డు పేర్కొంది. అయితే పరీక్షలో ప్రశ్నలు సిలబస్​లోని ఏ భాగం నుంచైనా ఉండవచ్చు. కాబట్టి విద్యార్థులు మొత్తం సిలబస్​ని క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలని సూచించింది.

8. మంచి మార్కుల కోసం విద్యార్థులు ప్రిపేర్​ అవ్వాల్సిన ముఖ్యమైన చాప్టర్లు ఏమైనా ఉన్నాయా?

పరీక్షల కోసం సెలెక్టివ్ స్టడీ చేయమని సీబీఎస్ఈ విద్యార్థులకు సలహా ఇవ్వదు. బోర్డు ప్రతి సబ్జెక్టులో సిలబస్​ని నిర్దేశించింది. పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు మొత్తం సిలబస్ నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి కాన్సెప్ట్స్​ అర్థం చేసుకోవాలి.

9. విద్యార్థి రచనా వేగం మందగించి, పేపర్ పూర్తి చేయలేకపోతే?

రాత వేగాన్ని పెంచడానికి, విద్యార్థులు సమాధానాలు రాస్తూ ప్రిపేర్​ అవ్వాలని సీబీఎస్ఈ సూచించింది. అంతేకాకుండా పరీక్ష సమయంలో ఏదైనా సమాధానం రాసే ముందు తమ ఆలోచనలను క్రమబద్ధీకరించుకుని సమయం తక్కువగా ఉంటే పాయింట్లలో సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. వారు మొత్తం ప్రశ్నను విస్మరించకూడదు.

10. పేపర్​ లీక్​ అంటూ కనిపించే వాటిని తీసుకోవచ్చా?

వదంతులు, ధృవీకరించని వార్తలను పట్టించుకోవద్దని సీబీఎస్ఈ విద్యార్థులకు గట్టిగా సూచిస్తోంది. పరీక్షల నిర్వహణకు బోర్డులో ఫూల్ ప్రూఫ్ విధానం ఉంది. విద్యార్థులకు తప్పుడు సమాచారం అందితే వెంటనే ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా బోర్డును సంప్రదించాలి.

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలకు సంబంధించిన మరిన్ని ఎఫ్​ఏక్యూల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం