తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Youtube : ఈ కొత్త ‘షాపింగ్​ ప్రోగ్రామ్​’తో యూట్యూబ్​ క్రియేటర్స్​పై కాసుల వర్షం..!

YouTube : ఈ కొత్త ‘షాపింగ్​ ప్రోగ్రామ్​’తో యూట్యూబ్​ క్రియేటర్స్​పై కాసుల వర్షం..!

Sharath Chitturi HT Telugu

25 October 2024, 13:05 IST

google News
  • YouTube shopping affiliate program : భారత్​లో కంటెంట్​ క్రియేటర్స్​కి కీలక అప్డేట్​ ఇచ్చింది. యూట్యూబ్​. క్రియేటర్స్​ కోసం కొత్త ఆదాయ వనరును ప్రవేశపెట్టింది. ఈ యూట్యూబ్​ షాపింగ్​ ప్రోగ్రామ్​ ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

యూట్యూబ్​ క్రియేటర్స్​కి గుడ్​ న్యూస్​!
యూట్యూబ్​ క్రియేటర్స్​కి గుడ్​ న్యూస్​!

యూట్యూబ్​ క్రియేటర్స్​కి గుడ్​ న్యూస్​!

భారత దేశంలోని యూట్యూబ్​ క్రియేటర్స్​కి క్రేజీ న్యూస్​! ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గం యాడ్​ అయ్యింది. ‘యూట్యూబ్​ షాఫింగ్​ అఫీలియేటెడ్​ ప్రోగ్రామ్​’ని ఈ వీడియ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్లిప్​కార్ట్​, మింత్రాతో యూట్యూబ్​ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఆదాయ వనరుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

యూట్యూబ్​ షాపింగ్​ ప్రోగ్రామ్​..

ఇది పనిచేసే విధానం ఏమిటంటే.. యూట్యూబ్​లోని క్రియేటర్లు తమ వీడియోల్లో వివిధ ప్రాడక్ట్స్​ని ట్యాగ్ చేయగలరు. వాటిని క్లిక్​ చేసి, రిటైలర్ల సైట్​లోకి వెళ్లి, ఎవరైనా కొనుగోలు చేస్తే.. క్రియేటర్లు ఆదాయం సంపాదించుకోగలరు.

"మేము దీనిని మార్కెట్​ప్లేస్​ అని పిలుస్తున్నాము. క్రియేటర్ల కోసం మేము రెవెన్యూ మార్గాలను సృష్టించాలనుకుంటున్నాము," అని షాపింగ్​ ఫర్​ యూట్యూబ్ జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కాట్జ్ చెప్పారు.

యూట్యూబ్​ షాపింగ్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​కి ఎలిజిబిలిటీని కూడా సంస్థ వెల్లడించింది. అవి.. భారతీయ క్రియేటర్లు (లేదా ప్రోగ్రామ్​ యాక్టివ్​ అిన దేశాలు), కనీసం 10వేల సబ్​స్క్రైబర్లు, మ్యూజిక్​ ఛానెల్​, పిల్లల కంటెంట్​ అవ్వకూడదు.

ప్రోగ్రామ్​లో భాగమైన క్రియేటర్స్​.. వారి వీడియోల్లో భాగంగా ప్రాడక్ట్స్​ని ప్రదర్శించగలరు. యూట్యూబ్ వీడియో ఇంటర్​ఫేస్​ను వదిలిపెట్టకుండా వీక్షకులు ఆ ప్రొడక్ట్ కు సంబంధించిన కొన్ని వివరాలను చూసేందుకు వీలుగా స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​టీవీలు, వెబ్​లోని ఇంటర్​ఫేస్ కోసం యాప్​లను యూట్యూబ్ అప్​డేట్ చేస్తోంది.

"ప్రాడక్ట్స్​ పనిచేసే విధానం గురించి వీక్షకులు కొన్ని ఉన్నత స్థాయి సమాచారాన్ని చూడవచ్చు. వారు కొనుగోలు చేయడానికి వెబ్సైట్​లోకి వెళ్లొచ్చు. ఆ సమయంలో, మీకు ఆ వెబ్సైట్​లో పూర్తిస్థాయి ఆప్షన్స్​ అందుబాటులో ఉంటాయి," అని కాట్జ్ చెప్పారు.

ఒక వేళ ప్రాడక్ట్​ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, పార్ట్​నర్​ షాపింగ్​ ప్లాట్​ఫామ్​లోకి రీ-డైరక్ట్​ అవుతారు. ప్రస్తుతం ఇందులో ఫ్లిప్​కార్ట్​, మింత్రాలు ఉన్నాయి. టీవీల్లో అయితే క్యూఆర్​ కోడ్​ ఓపెన్​ అవుతుంది. దాన్ని ఫోన్​లో స్కాన్​ చేసుకుని వర్క్​ చేసుకోవచ్చు. సంబంధిత ప్రాడక్ట్​ పేజ్​ ఓపెన్​ అయిన తర్వాత.. పేమెంట్​ ఆఫర్స్​, షిప్పింగ్​ వంటి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

ఇన్​స్టాగ్రామ్​లో ఇప్పటికే ఉన్న క్రియేటర్స్​ మార్కెట్​ప్లేస్​కి యూట్యూబ్​ కొత్త ప్రోగ్రామ్​ గట్టి పోటీనిచ్చే విధంగా ఉంది!

కేవలం 2023 లోనే షాపింగ్​ రిలేటెడ్​ కంటెంట్​కి యూట్యూబ్​లో 30 బిలియన్​ హవర్స్​ వాచ్​ టైమ్​ లభించింది. యూట్యూబ్​లో లక్ష సబ్​స్క్రైబర్లు ఉన్న ఛానెల్స్​ 1,10,000 కన్నా ఎక్కువే! వీరు రెవెన్యూగా రూ. 1లక్ష కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారిని యూట్యూబ్​ చెబుతోంది. ఇందులోనూ 10శాతం వార్షిక వృద్ధి నమోదవుతోందని స్పష్టం చేసింది.

సబ్​స్క్రిప్షన్​లు, యూట్యూబ్ యాడ్స్, బ్రాండ్ కనెక్ట్, సూపర్ థాంక్స్, సూపర్ స్టిక్కర్స్, ఛానల్ మెంబర్​షిప్​ల తరువాత యూట్యూబ్ షాపింగ్ అఫీలియేట్ ప్రోగ్రామ్ దేశంలోని క్రియేటర్లకు మరో ఆదాయ వనరుగా మారనుంది. 'యూట్యూబ్ షాపింగ్​ని విస్తరిస్తాం. యూట్యూబ్​లో ఉత్పత్తులను కనుగొనడం ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ఉండే భవిష్యత్తు వైపు మేము చూస్తున్నాము," అని కాట్జ్ స్పష్టం చేశారు.

ఈ యూట్యూబ్​ షాపింగ్​ అఫీలియేటెడ్​ ప్రోగ్రామ్​కి సంబంధించిన రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

తదుపరి వ్యాసం