తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flight Ticket : ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే విమాన టికెట్!

Flight Ticket : ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే విమాన టికెట్!

Anand Sai HT Telugu

02 January 2025, 11:06 IST

google News
  • Air India Ticket Price : ఎయిర్ ఇండియా.. విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ సేల్ ద్వారా రూ.1448కే ఫ్లైట్ టికెచ్ బుక్ చేసుకోవచ్చు.

ఎయిర్ ఇండియా న్యూ ఇయర్ సేల్
ఎయిర్ ఇండియా న్యూ ఇయర్ సేల్

ఎయిర్ ఇండియా న్యూ ఇయర్ సేల్

ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేసేవారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనుకునేవారికి కూడా ఈ ఆపర్ ఉపయోగపడనుంది. దేశీయ దిగ్గజ విమాన సంస్థ న్యూ ఇయర్ సేల్ కింద టికెట్లు విక్రయిస్తోంది. దీంతో తక్కువ ధరకే విమాన టికెట్ పొందవచ్చు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ న్యూ ఇయర్ సేల్‌లో భాగంగా లైట్ కింద రూ.1,448, వాల్యూ ఆఫర్ కింద రూ.1,599 ఫ్లైట్ ఛార్జీలను ప్రకటించింది. జనవరి 5 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చు. పరిమిత సీట్లు, నాన్ రిఫండబుల్ నిబంధనలు ఉన్నాయి. 2025లో ఎంపిక చేసిన ప్రయాణ తేదీల కోసం టికెట్లు బుక్ చేసుకోవాలి.

జనవరి 8, 2025 నుండి సెప్టెంబర్ 20, 2025 వరకు ప్రయాణానికి అవకాశం ఇస్తారు. జనవరి 5 వరకు చేసిన బుకింగ్‌లకు లైట్ ఆఫర్ కింద రూ .1,448, వాల్యూ ఆఫర్ కింద రూ .1,599 ధరలు ఉంటాయి. న్యూ ఇయర్ సేల్‌లో భాగంగా ఈ మేరకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ www.airindiaexpress.com లేదా అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా లాగిన్ అయిన లాయల్టీ సభ్యులకు లైట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆఫర్లలో బేస్ ఛార్జీలు, పన్నులు, విమానాశ్రయ ఛార్జీలు ఉంటాయి. కాని కన్వీనియన్స్ ఫీజు లేదా అనుబంధ సేవలు ఉండవు. PNRలో ప్రయాణించే సభ్యులకు ఎయిర్‌లైన్ NeuCoins ని అందజేస్తుంది. ప్రయాణికుడి రికార్డులు, ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఐడీతో సరిపోలడానికి ప్రతి సభ్యునికి బుకింగ్ చేసేటప్పుడు నమోదు చేసిన మొదటి పేరు, ఇంటి పేరు, మొబైల్ నంబర్‌ను అందిస్తుంది. ఇది ప్రయాణికుడి రికార్డులు, ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఐడీతో సరిపోలుతుంది.

క్యాన్సిల్ కాకుండా పూర్తయిన బుకింగ్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లావాదేవీ పూర్తిగా రద్దు అయితే బుకింగ్ ఆఫర్‌కు అర్హులు కాదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఎయిర్ ఇండియా విమానాలతోపాటుగా వెళ్లే మార్గాలకు అందుబాటులో ఉండవచ్చు. కానీ సీట్లు మాత్రం పరిమితం.

చెల్లింపులు చేసిన తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రీఫండ్లను అందించదు. క్యాన్సిల్ చేసే డబ్బు ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న రుసుములకు లోబడి ఉంటుంది. ఎలాంటి ముందస్తు నోటీసు, కారణం లేకుండా ఆఫర్‌ను రద్దు చేయడంతోపాటు నిలిపివేసే హక్కు ఎయిర్ లైన్స్ కు ఉంది. 'ఆఫర్ రద్దుతో ప్రత్యక్ష లేదా పరోక్షంగా జరిగిన నష్టాలకు విమానయాన సంస్థపై ఎటువంటి క్లెయిమ్ లేదా నష్టపరిహారానికి ప్రయాణికులకు అర్హత ఇవ్వదు.' అని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఎప్పటికప్పుడు ఆఫర్ నియమనిబంధనలను మార్చడానికి, తొలగించడానికి లేదా సవరించడానికి విమానయాన సంస్థకు హక్కు ఉందని ఎయిర్ ఇండియా తెలిపింది.

తదుపరి వ్యాసం