బ్రహ్మాండమైన సౌండ్‌తో సోనీ నుంచి రానున్న రెండు స్మార్ట్ టీవీలు.. 55, 65 అంగుళాల సైజ్
Published Jun 22, 2025 04:30 PM IST
- సోనీ ఇప్పుడు తన కొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సోనీ బ్రావియా 5 సిరీస్ టీవీని భారతదేశంలోకి తీసుకురానుంది.
సోనీ బ్రావియా 5 సిరీస్
సోనీ కొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు చూస్తోంది. సోనీ తన బ్రావియా 5 సిరీస్(ఎక్స్ఆర్ 50) టీవీని భారతదేశంలోకి తీసుకువస్తుంది. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో లభించే ఈ టీవీలను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రాబోయే టీవీ మైక్రోసైట్ కూడా అమెజాన్లో ప్రత్యక్షమైంది. దాని ప్రత్యేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడించింది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
క్లియర్ ఇమేజ్
బ్రావియా 5 సిరీస్ సోనీ అప్డేటెడ్ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్‌పై పనిచేస్తుంది. 4 కే హెచ్‌డీఆర్ ఫుల్ అరే ఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మెరుగైన బ్రైట్‌నెస్, లోతైన నలుపు రంగు కోసం ఎక్స్ఆర్ కాంట్రాస్ట్ బూస్టర్ 10ను సపోర్ట్ చేస్తుంది. అలాగే అస్పష్టత, శబ్దాన్ని తగ్గించడానికి ఎక్స్ఆర్ క్లియర్ ఇమేజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితమైన, శక్తివంతమైన రంగుల కోసం ఎక్స్ఆర్ ట్రిలుమినోస్ ప్రో, మినీ ఎల్ఈడీల నియంత్రణ కోసం ఎక్స్ఆర్ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ కూడా స్క్రీన్లో ఉన్నాయి.
మంచి ఆడియో
ఆడియో కోసం టీవీలో ఫ్రేమ్ ట్వీటర్, వాయిస్ జూమ్ 3తో అకౌస్టిక్ మల్టీ-ఆడియో ఉన్నాయి. ఇది డాల్బీ అట్మాస్, డీటీఎస్:ఎక్స్ సపోర్ట్ చేస్తుంది. అకౌస్టిక్ సెంటర్ సింక్‌తో, వినియోగదారులు సెంటర్ స్పీకర్‌గా ఉపయోగించడానికి హెచ్‌టీ-ఎ9 లేదా హెచ్‌టీ-ఎ7000 వంటి అనుకూలమైన సోనీ సౌండ్ బార్‌లతో టీవీని జత చేయవచ్చు.
యాప్స్‌కు సపోర్ట్
ఇది గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ కోర్ వంటి స్ట్రీమింగ్ యాప్స్‌కు బిల్ట్-ఇన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది ఆపిల్ ఎయిర్ ప్లే 2, గూగుల్ కాస్ట్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
గేమింగ్
బ్రావియా 5 సిరీస్ టీవీ గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. డెడికేటెడ్ గేమ్ మెనూ, హెచ్‌డీఎమ్ఐ 2.1, 120 హెర్ట్జ్ వద్ద 4కె సపోర్ట్, వీఆర్ఆర్, ఆల్మ్ అని కంపెనీ తెలిపింది. హెచ్‌డీఆర్ ఏ టోన్ మ్యాపింగ్, జెనర్ పిక్చర్ మోడ్ వంటి పీఎస్5 స్పెక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.