Mini UPS : వర్క్ ఫ్రం హోమ్‌లో పవర్ కట్ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్' సపోర్ట్ ఇవ్వండి..
23 June 2023, 11:32 IST
- Mini UPS : మీకు మినీ యూపీఎస్ గురించి తెలుసా? వైఫై రోటర్‌కు మినీ యూపీఎస్ సపోర్ట్ ఇస్తే.. ఇక పవర్ కట్స్‌లోనూ మీరు ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు!
వర్క్ ఫ్రం హోమ్‌లో పవర్ కట్ సమస్యలా? మీ వైఫైకి 'మినీ యూపీఎస్' సపోర్ట్ ఇవ్వండి..
Mini UPS : మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? పవర్ కట్స్‌తో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి విసిగెత్తిపోయారా? అయితే మీరు ఈ 'మినీ యూపీఎస్' గురించి తెలుసుకోవాల్సిందే! తక్కువ ఖర్చుతో వైఫై రోటర్‌కు మినీ యూపీఎస్ సపోర్ట్ ఇవ్వొచ్చు. ఇంతకి.. అసలేంటి ఈ మినీ యూపీఎస్? దీని ప్రయోజనాలేంటి? వంటివి ఇక్కడ తెలుసుకుందాము..
మినీ యూపీఎస్ అంటే ఏంటి?
ఇదొక చిన్న సైజు యూపీఎస్ సిస్టెమ్. దీని ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా ఉంటుంది. జనరేటర్, ఇన్వర్టర్తో పోల్చుకుంటే ఈ యూపీఎస్ కారణంగా పరికరాలకు అందే విద్యుత్‌లో ఎలాంటి లాగ్ ఉండదు. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ!
What is mini UPS : ఈ చిన్న డివైజ్‌లో.. డీసీ పవర్‌ను స్టోర్ చేసుకునేందుకు ఓ బ్యాటరీ ఉంటుంది. పవర్ కట్ అయితే.. ఈ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు ఏసీ పవర్ సప్లై అవుతుంది. మల్టిపుల్ ఔట్లెట్స్ ఉండటంతో.. వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను దీనికి అటాచ్ చేయవచ్చు.
ఈ మినీ యూపీఎస్ ఫీచర్స్ ఏంటి..?
- మినీ యూపీఎస్ చిన్న సైజులో ఉంటుంది. లైట్‌వెయిట్ కూడా!
- ఎలక్ట్రానిక్ పరికరాలకు 5 వోల్ట్- 12వోల్ట్ వరకు పవర్ సప్లైని ఇవ్వగలుగుతుంది ఈ మినీ యూపీఎస్.
- దీని నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ.
మినీ యూపీఎస్‌తో ప్రయోజనాలేంటి?
ఒక్క వైఫై రోటర్కే కాదు.. ఈ మినీ యూపీఎస్‌ను చాలా చోట్ల వాడుకోవచ్చు.
- మినీ యూపీఎస్‌ను కంప్యూటర్‌కు యటాచ్ చేస్తే.. పవర్ సప్లై సమయంలో ఉపయోగపడుతుంది. మన డేటాను సేవ్ చేసుకుని, షట్ డౌన్ చేసే సమయం లభిస్తుంది.
- సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు, ఎంపీ3 ప్లేయర్స్, పీఎస్పీ, డీవీడీ ప్లేయర్లు, బ్లూటూత్ డివైజ్‌లకు కూడా దీనిని వాడుకోవచ్చు.
- ఇంకా చెప్పాలంటే.. ఈ మినీ యూపీఎస్ అనేది మన ఫోన్‌కు ఓ పవర్ బ్యాంక్ కింద కూడ ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి:- Productivity hacks: వర్క్ ఫ్రమ్ హోంలో పనితీరు మెరుగుపడేందుకు 5 టిప్స్
ఓక్టర్ మినీ యూపీఎస్ హైలైట్స్..
Mini UPS for Wifi router uses : వైఫై రోటర్ బ్యాకప్ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిల్లో.. ఓక్టర్ మినీ యూపీఎస్ ఒకటి. దీని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఈ ఓక్టర్ మినీ యూపీఎస్‌తో వైఫై రోటర్‌కు 4 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను పొందవచ్చు. అంటే.. 4 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.
ఇళ్లల్లో ఒక్కోసారి హై-లో ఓల్టేజ్ సమస్యలు వస్తుంటాయి. ఈ ఓక్టర్ రోటర్ అన్నది ఆ సమస్యల నుంచి మన ఎలక్ట్రానిక్ పరికరాలను కాపాడుతుంది.
ఇందులోని స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ హైలైట్! ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా ఉండేదుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులోని ఇంటెలిజెంట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టెమ్త.. మనం కనెక్ట్ చేసిన డివైజ్‌కు ఎంత పవర్ సప్లై అవ్వాలో.. అంతే అవుతుంది.
దీనిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం! వాల్ సాకెట్‌కు ప్లగ్ చేసి స్టార్ట్ చేయడమే. డివైజ్‌లను దానికి కనెక్ట్ చేసుకోవచ్చు.
అమెజాన్‌లో ఓక్టర్ 12వీ మినీ యూపీఎస్ ధర ప్రస్తుతం రూ. 1,199గా ఉంది.