తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పర్సనల్ లోన్ ఈఎంఐ ఒక్కసారి చెల్లించడం మిస్ అయినా ఏమవుతుంది? తప్పకుండా చదవండి

పర్సనల్ లోన్ ఈఎంఐ ఒక్కసారి చెల్లించడం మిస్ అయినా ఏమవుతుంది? తప్పకుండా చదవండి

Anand Sai HT Telugu

Updated Jun 22, 2025 09:08 PM IST

google News
  • వ్యక్తిగత రుణం తీసుకొని ఈఎంఐ చెల్లించలేదా? అయితే మీరు ఈ న్యూస్ తప్పకుండా చదవాలి. మీరు వ్యక్తిగత రుణం తీసుకొని ఈఎంఐ చెల్లించకపోతే.. జరిమానాలు చెల్లించడం వంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. క్రెడిట్ స్కోరు దెబ్బతినవచ్చు.
పర్సనల్​ లోన్​ టిప్స్

పర్సనల్​ లోన్​ టిప్స్

్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ పద్ధతి పాటిస్తుంటారు. అయితే ఒక్కసారి పర్సనల్ లోన్ చెల్లించకపోయినా చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు వ్యక్తిగత రుణ ఈఎంఐ చెల్లించకపోతే.. రుణదాతలు జరిమానా వసూలు చేస్తారు. చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆలస్య చెల్లింపు రుసుము లేదా జరిమానా వడ్డీని వసూలు చేస్తాయి. ఇది సాధారణంగా తప్పిన ఈఎంఐ మొత్తంలో 1 నుండి 3 శాతం వరకు ఉంటుంది. ఇది అదనపు భారం. మీరు ఒకేసారి చెల్లించకపోతే నెలవారీ బడ్జెట్‌లో అంతరాయం కూడా కలిగిస్తుంది. కొంతమంది రుణదాతలు జరిమానా వడ్డీకి అదనంగా స్థిర రుసుమును కూడా వసూలు చేస్తారు.


ఈఎంఐ చెల్లించకపోవడం క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. CIBIL లేదా ఎక్స్‌పీరియన్ వంటి క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలకు నివేదిస్తే.. డిఫాల్ట్ 50 నుండి 100 పాయింట్ల తగ్గుదలకు దారితీస్తుంది. దీని వలన మళ్ళీ రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందడం కష్టమవుతుంది. పొందినప్పటికీ అధిక వడ్డీ రేటు వేస్తారు. చెల్లింపు 30 రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైతే అది మీ క్రెడిట్ నివేదికను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

డిఫాల్ట్ అయిన ఈఎంఐ 90 రోజుల కంటే ఎక్కువ కాలం తిరిగి పొందకపోతే.. రుణదాత మీ లోన్ ఖాతాను ఎన్‌పీఏగా గుర్తిస్తారు. ఇది మీ క్రెడిట్ నివేదికపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ లోన్ కలెక్షన్ ఏజెన్సీకి బదిలీ అవుతుంది. దీని వలన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.

వ్యక్తిగత రుణంపై బకాయిలు కలిగి ఉంటే.. అది మీ ప్రస్తుత క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. కొత్త రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణదాతలు మీ గత చెల్లింపు హిస్టరీని చూస్తారు. డిఫాల్ట్‌ల చరిత్ర మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు కారణమవుతుంది. మీరు రుణం పొందినా అధిక వడ్డీ రేటు విధిస్తారు.

ఈఎంఐ లింక్ చేసిన సేవింగ్స్ ఖాతా నుండి ఈసీఎస్ లేదా ఆటో-డెబిట్ ద్వారా తీసివేస్తే.. ఖాతాలో తగినంత నిధులు ఉంటే బ్యాంక్ స్వయంచాలకంగా ఈఎంఐని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. ఖాతాలో తగినంత నిధులు లేకపోతే ఈసీఎస్ బౌన్స్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రుణగ్రహీత ఇతర లింక్ చేసిన ఖాతాల నుండి నిధులను తీసుకోవడం ద్వారా బకాయి ఉన్న ఈఎంఐని సర్దుబాటు చేయవచ్చు.

ఈఎంఐ మిస్ అయితే వీలైనంత త్వరగా దాన్ని చెల్లించి రుణదాతకు తెలియజేయడం మంచిది. ఆర్థిక సమస్యల కారణంగా మిస్ అయితే.. చాలా మంది రుణదాతలు రీషెడ్యూల్ సదుపాయాలను అందిస్తారు. బకాయి ఉన్న మొత్తాన్ని చిన్న వాయిదాలలో చెల్లించమని లేదా చెల్లింపును వాయిదా వేయమని కూడా అభ్యర్థించవచ్చు. మీకు వ్యక్తిగత రుణంపై ఈఎంఐలు బాకీ ఉంటే.. మీరు వాటిని విస్మరించకూడదు. ఇది మీ ఆర్థిక, క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది.