Mid range smartphones : మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ తోపులు- ఏది వాల్యూ ఫర్ మనీ?
25 November 2024, 7:20 IST
Mid range smartphones : వివో వీ40ఈ వర్సెస్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ తోపులు
ఫీచర్లతో నిండిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? కానీ పరిమిత బడ్జెట్ ఉందా? అయితే ఇది మీకోసమే! వివో వీ40ఈ ఇటీవల మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కొన్ని నెలలుగా మార్కెట్లో ఉంది. మిడ్ రేంజ్, రూ. 30వేల ధర సెగ్మెంట్లో ఈ రెండు గ్యాడ్జెట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో వీ40ఈ వర్సెస్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్..
డిజైన్, డిస్ప్లే: వివో వీ40ఈలో ప్లాస్టిక్ బ్యాక్ ఉంది. ఇది చాలా సొగసైన, తేలికైనదిగా ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ని సౌకర్యవంతంగా, ఈజీ టు క్యారీ విధంగా చేస్తుంది. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రేర్ ప్యానెల్ గ్లైఫ్ ఇంటర్ఫేస్ని కలిగి ఉంది. ఇది మరింత ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. అయితే.. ఇది వివో వీ40ఈ కంటే బరువైనది.
వివో వీ40ఈ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేని కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అయితే ఇందులో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లేదు!
కెమెరా: వివో వీ4ఈ డ్యూయెల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డ్యూయెల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ: వివో వీ40ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 12 జీబీ ర్యామ్‌తో కనెక్ట్ చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రోతో పనిచేస్తుంది. ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.
బ్యాటరీ లైఫ్ పరంగా, వివో వీ40ఈ- నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ రెండూ 5,000 ఎంఏహెచ్ మద్దతుతో 50 వాట్ ఛార్జింగ్ స్పీడ్‌ని సపోర్ట్ చేస్తాయి.
ధర : వివో వీ40ఈ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 28999. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది.