తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Red Car Myths : రెడ్ కలర్ కారుపై ఉన్న అపోహలు.. నిజంగానే వీటితో ప్రమాదాలు ఎక్కువనా?

Red Car Myths : రెడ్ కలర్ కారుపై ఉన్న అపోహలు.. నిజంగానే వీటితో ప్రమాదాలు ఎక్కువనా?

Anand Sai HT Telugu

14 October 2024, 19:37 IST

google News
    • Red Colour Car Myths : చాలా మంది రెడ్ కలర్ కారు గురించి కొన్ని విషయాలు చెబుతుంటారు. వీటిపై అనేక అపోహలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ప్రచారం చేశారో చూద్దాం. ఇవి కేవలం అపోహలు మాత్రమే.
ఎరుపు రంగు కారుపై అపోహలు
ఎరుపు రంగు కారుపై అపోహలు (Unsplash)

ఎరుపు రంగు కారుపై అపోహలు

ఎరుపు అనేది విభిన్న భావాలను, నమ్మకాలను రేకెత్తించే రంగుగా ఉంది. కొందరికి ఈ రంగులు చూస్తే భయం. మరికొందరికి ఇష్టం. కొన్ని సంస్కృతులలో ఎరుపు ప్రమాదాన్ని సూచిస్తుంది. మరికొన్నింటిలో ఇది ప్రేమ లేదా అదృష్టాన్ని తెలుపుతుంది. చాలా మంది ఎరుపు కార్లను వాడుతుంటారు. కార్ల విషయానికి వస్తే ఎరుపు వాహనాల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. 90వ దశకంలో పెరిగిన చాలా మందికి ఎరుపు రంగు కారును చూసి ఆరుసార్లు చప్పట్లు కొట్టడం సాయంత్రం శుభం కలిగిస్తుందనే విషయం వినే ఉంటారు. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి.

ప్రమాదాలు ఎక్కువనా?

ఎరుపు రంగు కార్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనేది కొందరికి నమ్మకం. ఈ ప్రచారం ఎరుపు రంగును ప్రమాదంతో ముడిపెట్టడం నుండి వచ్చి ఉండవచ్చు. దీనిని సమర్ధించే ఆధారాలు లేవు. ప్రమాదాలు కారు రంగు కంటే డ్రైవర్ ప్రవర్తన, రహదారి పరిస్థితులు, ఇతర వాహనదారులు వచ్చే తీరుపై ఆధారపడి ఉంటాయి. రంగుతో ప్రమాదాలు జరుగుతాయనేది అపోహ మాత్రమే.

బీమా ఎక్కువ వస్తుందా?

మరొక సాధారణ అపోహ ఏంటంటే.. ఎరుపు రంగు కార్ల బీమా ప్రీమియం ఇతర రంగుల కార్ల కంటే ఎక్కువగా ఉంటాయని. భీమా కంపెనీలు వాహనం రంగుపై తమ బీమా రేట్లను డిసైడ్ చేయవు. ప్రీమియం అనేది కారు మోడల్, ఇంజిన్ సామర్థ్యం, ​​డ్రైవర్ వయస్సు, ప్రమాద సందర్భం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.

దొంగిలించే అవకాశం ఎక్కువుందా?

కొందరు వ్యక్తులు ఎర్రటి కార్లు ఎక్కువగా దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. నిజానికి దొంగలు వాహనాలను ఇవేమీ పట్టించుకోరు. వాటి రంగును లక్ష్యంగా చేసుకోరు. ఎరుపు రంగు కారును కలిగి ఉండటం వలన దొంగతనం ప్రమాదాన్ని పెంచదు.

వేడి అతిగా ఉంటుందా?

ఎరుపు రంగు కార్లు ఇతర రంగుల కంటే వేడిగా ఉంటాయనే అభిప్రాయం కూడా ఉంది. నలుపు వంటి ముదురు రంగులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఎరుపు ఎక్కువ వేడిని కలిగిస్తుందనేది కూడా కరెక్ట్ కైదు. కారు ఉష్ణోగ్రతపై రంగు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

ఇలాంటి ప్రచారాలు ఉన్నా.. చాలా మంది ఎరుపు రంగు కార్లను వైబ్రెంట్ లుక్, క్లాసీ లుక్ కారణంగా ఇష్టపడతారు. కారు రంగును ఎంచుకోవడం అనేది నిరాధారమైన నమ్మకాల మీద ఆధారపడి ఉండకూడదు. వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉండాలి. ఎరుపు దాని బోల్డ్, చూపునకు అద్భుతమైనది ఉండటం కారణంగా ఒక బెటర్ ఆప్షన్.

ఆధారం లేని ప్రచారాలు

రెడ్ కలర్ కార్ల గురించి అపోహలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నమ్మకాలకు ఎలాంటి ఆధారం లేదు. కారును ఎంచుకోవడం అనేది ప్రచారాల కంటే వ్యక్తిగత అభిరుచితో ఉండాలి. ఎరుపు రంగు కారుపైనే కాకుండా ఇతర రంగుల కార్లపై కూడా ఇలాంటి ప్రచారాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ నమ్మవద్దు. ఎరుపు రంగు కార్లను ఇష్టపడని వ్యక్తులు లేదా ఇతర రంగులను ఇష్టపడే వ్యక్తులు సృష్టించిన అపోహ ఇది. మీరు ఎరుపు రంగును ఇష్టపడితే ఆ కారు కొనుక్కోండి.

ప్రమాదాలు, బీమాలు, దొంగతనం మొదలైనవి కారు రంగును బట్టి ఉండవు. ఎరుపు రంగు కారు ఇతర రంగుల కార్ల మాదిరిగానే ఉంటుంది. చాలా మంది ఎరుపు రంగు కార్లను ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా సులభంగా కనిపించే రంగు ఇది.

కార్ల తయారీ కంపెనీలు తమ కారు డిజైన్‌కు సరిపోయేలా, కస్టమర్‌లు కోరుకునే రంగుతో కారు రంగును డిజైన్ చేస్తాయి. వీటిలో చాలా కార్లు రెడ్ కలర్ ఆప్షన్‌ను పొందుతాయి. దీన్ని మిగిలిన వాహనంతో పోల్చడం సరికాదు. ఎందుకంటే కారు రంగు ఆధారంగా ఘటనలు జరగవు.

తదుపరి వ్యాసం