HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tcs Freshers Jobs : 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్న టీసీఎస్.. ఫ్రెషర్స్‌‌ను తీసుకునేందుకు ఆసక్తి!

TCS Freshers Jobs : 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్న టీసీఎస్.. ఫ్రెషర్స్‌‌ను తీసుకునేందుకు ఆసక్తి!

Anand Sai HT Telugu

15 July 2024, 15:30 IST

  • TCS Jobs In Telugu : వేరియబుల్ పే విషయంలో ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది టీసీఎస్ కంపెనీ. అయితే ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టుగా టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పుకొచ్చారు.

టీసీఎస్ జాబ్స్
టీసీఎస్ జాబ్స్ (Reuters)

టీసీఎస్ జాబ్స్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని అనుకుంటోంది. ఒక్క జూన్ త్రైమాసికంలోనే కంపెనీ 5,452 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరింది. టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రతిభావంతులకు గమ్యస్థానం అని పేర్కొన్నారు. భారత టాలెంట్‌కు సానుకూల మార్గం లభిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నానని తెలిపారు. ఈ ఏడాది 40 వేల మందిని కొత్తగా తీసుకోనున్నట్టుగా చెప్పారు.

ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ టీసీఎస్ ఉద్యోగులు అడాప్ట్ చేసుకోవడంలో నిష్ణాతులని అన్నారు. ఆఫీస్ అటెండెన్స్ ను ఇంటిగ్రేట్ చేయడానికి కంపెనీ ఇటీవల తన వేరియబుల్ పే పాలసీని అప్ డేట్ చేసింది. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి వచ్చారని తెలిపారు. 'ఈ ఆలోచన మంచిదే అని, కార్యాలయ హాజరును సానుకూలంగా ప్రోత్సహించడం.' అని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.

70శాతం ప్లస్ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేస్తున్నారని మిలింద్ చెప్పుకొచ్చారు. ఇది ఉద్యోగులను శిక్షించడానికి చేసిన విషయం కాదని స్పష్టం చేశారు. కార్యాలయానికి పనికి రావడం విలువను అర్థం చేసుకోవాలని అన్నారు. అర్థం చేసుకోని వ్యక్తులు, అర్థం చేసుకుంటారని నిర్ధారించడానికి తీసుకున్న చర్యగా చెప్పారు.

ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు వేరియబుల్ పేతో లింక్ పెట్టింది టీసీఎస్. దీనితో ఉద్యోగులు ఆఫీసుకు రావడం పెరిగింది. ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. గతంలోనే వేరియబుల్ పే విషయంలో ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మిలింద్. ఆఫీసులకు వచ్చి పని చేసిన ఉద్యోగులకే వేరియబుల్ పే ఎక్కువగా చెల్లిస్తామని ప్రకటించారు. వేరియబుల్ పేకు ఉద్యోగుల అటెండెన్స్‌కు లింక్ చేశారు.

ఏ వేరియబుల్ పే తీసుకున్నా వచ్చేవారికి వెళ్తుందని మిలింద్ స్పష్టం చేశారు. ఆ డబ్బును కంపెనీ మరే విధంగానూ ఉపయోగించడం లేదని తిరిగి ఉద్యోగులకు వెళ్తుందన్నారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్