Upcoming Tata Cars : 2025లో టాటా మోటర్స్ నుంచి 4 కొత్త కార్లు.. ఈ లిస్టులో రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా
01 December 2024, 19:00 IST
- Upcoming Tata Cars : కొత్త ఏడాది 2025లో టాటా మోటర్స్ నుంచి నాలుగు కొత్త కార్లు రానున్నాయి. ఈ లిస్టులో రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..
టాటా హారియర్ ఈవీ
భారత మార్కెట్‌లో టాప్ కార్ల కంపెనీ జాబితాలో టాటా మోటార్స్ కూడా ఉంటుంది. ఈ కంపెనీ కార్లు మంచి డిమాండ్ ఉంది. టాటా మోడల్స్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో కూడా దొరుకుతాయి.ఇందులో టాటా పంచ్, టాటా నెక్సాన్ వంటి ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న టాటా మోటర్స్ మరింత పట్టుసాధించేందుకు కొత్త కార్లను కూడా తీసుకువస్తుంది. ఇందులో కొన్ని కార్లు అప్‌డేటెడ్‌గా వస్తాయి. 2025లో టాటా నుంచి రాబోయే కొత్త కార్ల గురించి చుద్దాం..
టాటా టియాగో/టిగోర్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో పరిచయం చేస్తుంది. అప్‌డేట్ చేసిన హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ కొత్త ఫీచర్లతో పాటు అనేక మార్పులతో వస్తుంది. 2026-2027లో కొత్త జెన్ మోడల్ రాకముందు టాటా టియాగో, టిగోర్ రెండో ఫేస్‌లిఫ్ట్ ఇది.
టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ సియెర్రా అమ్మకాల్లో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సియెర్రా ఈవీ త్వరలో ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌తో పరిచయం అవుతుంది. ఇది 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తరువాత ఇది ఐసీ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ, మోటారు, రేంజ్ గురించి అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు.
టాటా హారియర్ ఈవీ
టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి టాటా మోటార్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో హారియర్ ఈవీని తీసుకువస్తుంది. ఇది చాలా కాలంగా అభివృద్ధి దశలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతీయ రోడ్లపై పరీక్ష సమయంలో అనేక సార్లు కనిపించింది. టాటా హారియర్ ఈవీ OMEGA-Arc ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేశారు.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి 60 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుందని అంటున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ మోటార్ సెటప్‌తో ఏడబ్ల్యూడీ ఆప్షన్స్‌లో వస్తుంది. దీని డిజైన్ ఇప్పటికే ఉన్న హారియర్ మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు.