Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 10 స్టాక్స్ మీ వాచ్ లిస్ట్‌లో ఉండాలి..!
Published Oct 07, 2025 08:15 AM IST
- ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌లను నిపుణులు వెల్లడించారు. వాటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 583 పాయింట్లు పెరిగి 81,790 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 183 పాయింట్లు వృద్ధిచెంది 25,078 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 516 పాయింట్లు పెరిగి 56,104 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 313.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5036.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 3,502.34 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,442.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,000 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్‌ని దాటింది. ఇప్పుడు అదే లెవల్ కీలక సపోర్ట్‌గా మారే అవకాశం ఉంది. సూచీ 25,200- 25,500 వరకు వెళ్లొచ్చు,” అని ఆశికా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.14 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.36శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.71 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్- బై రూ. 648, స్టాప్ లాస్ రూ. 625, టార్గెట్ రూ. 695
అవెలాన్ టెక్నాలజీస్- బై రూ. 1,130, స్టాప్ లాస్ రూ. 1090, టార్గెట్ రూ. 1212
డెల్హివరీ- బై రూ. 462, స్టాప్ లాస్ రూ. 438, టార్గెట్ రూ. 495
గ్రావిటా ఇండియా- బై రూ. 1544, స్టాప్ లాస్ రూ. 1510, టార్గెట్ రూ. 1590
హెచ్ఏఎల్- బై రూ. 4,844, స్టాప్ లాస్ రూ. 4750, టార్గెట్ రూ. 4950
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్: రూ .1060 వద్ద కొనండి, టార్గెట్ రూ .1140, స్టాప్ లాస్ రూ .1020;
అనూప్ ఇంజినీరింగ్: రూ .2492 వద్ద కొనండి, టార్గెట్ రూ .2675, స్టాప్ లాస్ రూ .2400;
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్: రూ .722 వద్ద కొనండి, లక్ష్యం రూ .777, స్టాప్ లాస్ రూ .700;
యథార్థ్ హాస్పిటల్ & ట్రామా క్రె ఎస్ఆర్వీసీఎస్: రూ.781 వద్ద కొనండి, రూ.840 టార్గెట్, స్టాప్ లాస్ రూ.755;
ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్: రూ .642 వద్ద కొనండి, టార్గెట్ రూ .690, స్టాప్ లాస్ రూ .620
