Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌ని ట్రాక్ చేయండి..
11 October 2024, 8:50 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 144 పాయింట్లు పెరిగి 81,611 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 16 పాయింట్లు పెరిగి 24,998 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 524 పాయింట్లు వృద్ధి చెంది 51,531 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 దగ్గర స్టెబులిటీ ఉంటే.. నిఫ్టీ 24,380- 24,400 వరకు వెళ్లొచ్చు. 23,800 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన సపోర్ట్ ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4926.61 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3878.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 54231.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 54061.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.14శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.05 పతనమైంది.
2022 తర్వాత సౌత్ కొరియా బ్యాంకు తొలిసారి వడ్డీ రేట్లను కట్ చేసిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
అపార్ ఇండస్ట్రీస్:- బై రూ. 10649.7, స్టాప్ లాస్ రూ. 10250, టార్గెట్ రూ. 11350
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్:- బై రూ. 4659.75, స్టాప్ లాస్ రూ. 4488, టార్గెట్ రూ. 4900
క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్- బై రూ. 1520, స్టాప్ లాస్ రూ. 1485, టార్గెట్ రూ. 1595
గెయిల్- బై రూ. 226, స్టాప్ లాస్ రూ. 218, టార్గెట్ రూ. 235
మహీంద్ర అండ్ మహీంద్ర- బై రూ. 3200, స్టాప్ లాస్ రూ. 3140, టార్గెట్ రూ. 3330
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
శారదా మోటార్ ఇండస్ట్రీస్: రూ.2103.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2244, స్టాప్ లాస్ రూ.2025;
ఆన్‌మొబైల్: రూ.91.60, టార్గెట్ రూ.96.50, స్టాప్ లాస్ రూ.88;
శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో: రూ .898.50 వద్ద కొనండి, టార్గెట్ రూ .950, స్టాప్ లాస్ రూ .866;
పవ్నా ఇండస్ట్రీస్: రూ.602 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.640, స్టాప్ లాస్ రూ.580; మరియు
క్రెస్ట్ వెంచర్స్: రూ .525.80 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .560, స్టాప్ లాస్ రూ .507.