Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్..
Published Feb 10, 2025 08:10 AM IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నేటి స్టాక్స్ టు బై టుడే లిస్ట్..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 198 పాయింట్లు పడి 77,860 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 43 పాయింట్లు పడి 23,560 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్లు నష్టపోయి 50,159 వద్దకు చేరింది.
“నిఫ్టీ50కి 23,200 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉంది. 23900 రెసిస్టెన్స్‌గా ఉంది. దీనిపైన బ్రేకౌట్ అయితే నిఫ్టీ50 24,200 వరకు వెళ్లొచ్చు,” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 470.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 454.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 10179.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,274.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.99 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.95శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.36 శాతం పడిపోయింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఆర్తీ ఫార్మాల్యాబ్స్- బై రూ. 740.85, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 790
ఎన్డీఆర్ ఆటో కాంపొనెంట్స్- బై రూ. 788.25, స్టాప్ లాస్ రూ. 760, టార్గెట్ రూ. 840
ఐటీసీ- బై రూ. 430, స్టాప్ లాస్ రూ. 415, టార్గెట్ రూ. 460
టోరెంట్ పవర్- బై రూ. 1405, స్టాప్ లాస్ రూ. 1370, టార్గెట్ రూ. 1450
వోల్టాస్- బై రూ. 1380, స్టాప్ లాస్ రూ. 1360, టార్గెట్ రూ. 1430
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
భారతీ హెక్సాకామ్: రూ.1465.8 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1570, స్టాప్ లాస్ రూ.1415;
వెల్స్పన్ కార్ప్: రూ.801.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.850, స్టాప్ లాస్ రూ.770;
కేఆర్‌బీఎల్: రూ.301.3 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.320, స్టాప్ లాస్ రూ.290;
శారదా ఎనర్జీ అండ్ మినరల్స్: రూ.466.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.500, స్టాప్ లాస్ రూ.450;
కాంటాబిల్ రిటైల్ ఇండియా: రూ .329.85 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .350, స్టాప్ లాస్ రూ .320.