Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
Published Feb 07, 2025 08:19 AM IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్ టు బై టుడే..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు పడి 78,058 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు పడి 23,603 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్లు పెరగి 50,382 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3549.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2721.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 9709.01 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,819.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.28 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.36శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.51 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
జగ్సోన్పాల్ ఫార్మా- బై రూ. 273.5, స్టాప్ లాస్ రూ. 260, టార్గెట్ రూ. 295
కావేరీ సీడ్స్- బై రూ. 985.35, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 1060
సిప్లా- బై రూ. 1472, స్టాప్ లాస్ రూ. 1445, టార్గెట్ రూ. 1500
ఇన్ఫోసిస్- బై రూ. 1918, స్టాప్ లాస్ రూ. 1900, టార్గెట్ రూ. 1950
హెచ్డీఎఫ్సీ లైఫ్- బై రూ. 633, స్టాప్ లాస్ రూ. 615, టార్గెట్ రూ. 655
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మహారాష్ట్ర సీమ్‌లెస్: రూ.654.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.700, స్టాప్ లాస్ రూ.631;
ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్: రూ.1,285.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,375, స్టాప్ లాస్ రూ.1,240;
ఏజిస్ లాజిస్టిక్స్: రూ.813 వద్ద కొనండి, టార్గెట్ రూ.870, స్టాప్ లాస్ రూ.784;
నాట్కో ఫార్మా: రూ.1,328 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,421, స్టాప్ లాస్ రూ.1,281;
రెడింగ్టన్: రూ.228 వద్ద కొనండి, టార్గెట్ రూ.244, స్టాప్ లాస్ రూ.220.