HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rvnl Shares : ఈ రైల్వే షేర్లు పాత రికార్డులు బద్దలు కొట్టాయి.. దీనికి గల కారణాలు తెలుసుకోండి

RVNL Shares : ఈ రైల్వే షేర్లు పాత రికార్డులు బద్దలు కొట్టాయి.. దీనికి గల కారణాలు తెలుసుకోండి

Anand Sai HT Telugu

08 July 2024, 16:51 IST

    • Railway Vikas Nigam Ltd Share Price : స్టాక్ మార్కెట్లో రైల్వే రంగానికి సంబంధించిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. ఈ కంపెనీల్లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్లు కూడా ఉన్నాయి. ఈ షేర్ వాల్యూ పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం..
రైల్వే స్టాక్
రైల్వే స్టాక్

రైల్వే స్టాక్

స్టాక్ మార్కెట్ ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజున బలహీనంగా ప్రారంభమైంది. అయినప్పటికీ రైల్వే స్టాక్స్ పుంజుకునే ప్రక్రియ కనిపిస్తోంది. సోమవారం ఉదయం ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు భారీగా పెరిగాయి. దీంతోపాటు ఐఆర్సీటీసీ షేర్లు కూడా 2 శాతం లాభపడ్డాయి.

బీఎస్ఈలో రైల్ వికాస్ నిగమ్ షేరు రూ.508.30 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈలో కంపెనీ షేరు ధర ఒక దశలో 15.49 శాతం పెరిగి జీవితకాల గరిష్టం రూ.567.60కి చేరుకుంది. బీఎస్ఈలో ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేరు రూ.313.20 వద్ద ప్రారంభమైంది. కంపెనీ షేరు ధర ఒక దశలో 8 శాతం లాభంతో 52 వారాల గరిష్ట స్థాయి రూ.334.35కు చేరుకుంది.

గత ఏడాది కాలంలో మంచి పనితీరు కనబరిచిన టాప్ రైల్వే స్టాక్స్ లో ఐఆర్ఎఫ్సీ ఒకటి. సోమవారం కంపెనీ షేర్లు 9 శాతం పెరిగాయి. దీంతో షేరు ధర రూ.200 దాటింది. ఈ రోజు కంపెనీ ఇంట్రాడే గరిష్టం రూ.206. వీటన్నింటితో పాటు ఐఆర్సీటీసీ షేరు 2 శాతానికి పైగా లాభంతో 52 వారాల గరిష్ట స్థాయి రూ.1049.45కు చేరుకుంది.

రైల్వే షేర్లు పెరగడానికి కారణమేంటి?

25000 కొత్త జనరల్ ప్యాసింజర్ కోచ్ లు, 1000 అదనపు కోచ్ లను తయారు చేసే ప్రణాళిక రైల్వే రంగానికి చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు పెరగడానికి కారణం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 50 కొత్త అమృత్ భారత్ రైళ్లను తీసుకురానున్నట్టుగా ప్రకటించారు. దీంతో పాటు సాధారణ బడ్జెట్ లో రైల్వే శాఖ నిధులకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కారణాలన్నింటి కారణంగా రైల్వే షేర్లు జోరందుకున్నాయి.

వచ్చే ఐదేళ్లలో 3000 కొత్త రైళ్లను తీసుకువస్తామని 2023 నవంబర్లో రైల్వే మంత్రి చెప్పారని ప్రాఫిట్మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ చెప్పారు. దీంతో సాధారణ బడ్జెట్ లో కొన్ని భారీ ప్రకటనలు వస్తాయన్న అంచనాలు పెరిగాయి. దీంతో రైల్వే షేర్లు దూసుకెళ్లాయి.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నాం.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్