ఇరాన్‌పై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు అతి భారీ నష్టాలు తప్పవా?
Published Jun 23, 2025 08:15 AM IST
- ఇరాన్‌పై అమెరికా దాడి చేయడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? గిఫ్ట్ నిఫ్టీ ఏం సూచిస్తోంది? పూర్తి వివరాలు..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1046 పాయింట్లు పెరిగి 82,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 319 పాయింట్లు వృద్ధిచెంది 25,112 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 675 పాయింట్లు పెరిగి 56,253 వద్దకు చేరింది.
మారిన పరిస్థితులు- మదుపర్లలో టెన్షన్ టెన్షన్!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆదివారం అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు ఉల్లికిపడ్డాయి. మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా దాడులతో ఇరాన్.. స్టైట్ ఆఫ్ హార్ముజ్‌ని మూసివేస్తామని హెచ్చరించింది. ఈ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాకు అత్యంత కీలకమైనది. ఇరాన్ ఈ పనిచేస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయని మదుపర్లలో భయం మొదలైంది. ముడి చమురు ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లకు మంచిది కాదు. ఈ పూర్తి పరిణామాలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలవైపు అడుగులు వేస్తున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,704.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,657.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 25,200 లెవల్స్ పైన క్లోజ్ అయితే ప్రస్తుత కన్సాలిడేషన్ బ్రేక్ అయినట్టు పరిగణించవచ్చు. అక్కడి నుంచి 25,600- 25,800 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. కిందివైపు 24,700-24,400 సపోర్ట్లుగా ఉన్నాయి,” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.08 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.22శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.51 శాతం పడింది. కాగా యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అంతర్జాతీయ అనిశ్చితి కారమంగా బ్రెంట్ క్రూడ్ 2.49శాతం పెరిగి బ్యారెల్‌కు 78.92 డాలర్లకు చేరింది. జనవరి తర్వాత ఇదే అత్యధికం!
స్టాక్స్ టు బై..
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1278.4, స్టాప్ లాస్ రూ. 1230, టార్గెట్ రూ. 1360
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్- బై రూ. 356.2, స్టాప్ లాస్ రూ. 344, టార్గెట్ రూ. 380
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 1360, స్టాప్ లాస్ రూ. 1320, టార్గెట్ రూ. 1410
టాటా మోటార్స్- బై రూ. 676, స్టాప్ లాస్ రూ. 655, టార్గెట్ రూ. 700
నేషనల్ అల్యుమీనియ్ కంపెనీ- బై రూ. 184, స్టాప్ లాస్ రూ. 178, టార్గెట్ రూ. 192