Skoda Octavia RS : రూ. 50లక్షలు విలువ చేసే ఈ కారును ఎగబడి కొంటున్నారు!
Published Oct 11, 2025 11:20 AM IST
- స్కోడా అక్టేవియా ఆర్ఎస్కి భారతీయుల నుంచి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది! 100 యూనిట్లు అమ్మకానికి పెట్టగా, బుకింగ్స్ మొదలైన కొన్ని రోజులకే అన్నీ సేల్ అయిపోయాయి!
స్కోడా అక్టేవియా ఆర్ఎస్
స్కోడా ఇండియా ఇటీవల భారత మార్కెట్‌లో ఆక్టేవియా ఆర్ఎస్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 17న అధికారికంగా లాంచ్ చేయనున్న ఈ వాహనం కోసం రూ. 2.50 లక్షల బుకింగ్ మొత్తంతో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. అియితే, ఈ కారుకు క్రేజీ డిమాండ్ కనిపించింది! బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే, ఈ పవర్‌ఫుల్ వెర్షన్‌కు చెందిన 100 యూనిట్లు (కేవలం 100 మాత్రమే అమ్మకానికి ఉన్నాయి) పూర్తిగా అమ్ముడైపోయాయి!
స్కోడా అక్టేవియా ఆర్ఎస్- కలర్ ఆప్షన్స్..
2025 ఆక్టేవియా ఆర్ఎస్ ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో (పెయింట్ షేడ్స్) అందుబాటులో ఉంటుంది: మాంబా గ్రీన్, మ్యాజిక్ బ్లాక్, రేస్ బ్లూ, క్యాండీ వైట్, వెల్వెట్ రెడ్. భారతదేశంలో కనిపించే ఆర్ఎస్ మోడల్ ప్రపంచవ్యాప్త మోడల్‌ను పోలి ఉంటుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన స్కోడా సిగ్నేచర్ రంగు అయిన మాంబా గ్రీన్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ.
స్కోడా అక్టేవియా ఆర్ఎస్- స్పోర్టీ డిజైన్, స్టైల్..
దాని ‘RS’ బ్యాడ్జ్‌కు తగ్గట్టుగా, ఈ సెడాన్ స్పోర్టీ బాహ్య రూపాన్ని కలిగి ఉంది. స్కోడా ఇందులో గ్రిల్, బంపర్‌లు, సైడ్ విండోస్, వింగ్ మిర్రర్స్ టైల్‌పైప్‌ల చుట్టూ గ్లోస్ బ్లాక్ యాక్సెంట్‌లను జోడించింది. ఇవి కారు రంగుకు కాంట్రాస్ట్‌గా నిలుస్తాయి. గ్రిల్‌పై వీఆర్ఎస్ లోగో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు స్మోక్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. ఇతర ఎలిమెంట్స్‌లో ఎరుపు రంగు పెయింటెడ్ బ్రేక్ కాలిపర్‌లు, నలుపు బూట్ లిప్ స్పాయిలర్ ఉన్నాయి. ఇవి కారు అగ్రెసివ్ వైఖరిని పూర్తి చేస్తాయి.
ఆర్ఎస్ ప్రత్యేకతలతో ఆల్-బ్లాక్ క్యాబిన్..
లోపలి భాగంలో స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ పూర్తిగా ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను అనుసరిస్తుంది. దీనికి ఎరుపు రంగు కాంట్రాస్ట్ స్టిచింగ్, బ్లాక్ హెడ్‌లైనర్ అదనపు స్టైల్‌ని అద్దుతాయి. ముందు భాగంలో కూర్చునే వారికి ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లతో కూడిన స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే ఆర్ఎస్-ప్రత్యేక గ్రాఫిక్స్‌ను చూపుతాయి. క్యాబిన్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రీస్టాండింగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, సాఫ్ట్-టచ్ కంట్రోల్స్స ప్రీమియం మెటీరియల్స్ స్పోర్టీ అనుభూతిని మరింత పెంచుతాయి.
2025 స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ లోని ప్రధాన ఫీచర్లు ఇవే:
10 ఎయిర్‌బ్యాగ్‌లు (పూర్తి భద్రత కోసం)
ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్
19-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్
స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
12.9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
హెడ్-అప్ డిస్‌ప్లే
త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
కూలింగ్, హీటింగ్, మసాజ్, మెమరీ ఫంక్షన్లతో ఫ్రంట్ స్పోర్ట్ సీట్లు
360-డిగ్రీ కెమెరా
వైర్‌లెస్ మొబైల్ ప్రొజెక్షన్
మల్టిపుల్ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు
675డబ్ల్యూ కాంటన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్
ఆర్ఎస్-ప్రత్యేక వర్చువల్ కాక్‌పిట్ గ్రాఫిక్స్
