తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi A4 5g Discount : ఈ రెడ్‌మీ ఫోన్‌పై పండగ ఆఫర్.. భారీగా డిస్కౌంట్, చాలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్

Redmi A4 5G Discount : ఈ రెడ్‌మీ ఫోన్‌పై పండగ ఆఫర్.. భారీగా డిస్కౌంట్, చాలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్

Anand Sai HT Telugu

Published Jan 12, 2025 07:00 PM IST

google News
    • Redmi A4 5G Discount : పండుగ సీజన్ కావడంతో స్మార్ట్ ఫోన్ల మీద డిస్కౌంట్లు నడుస్తున్నాయి. మీరు రెడ్‌మీ ఫోన్ లవర్ అయి ఉంటే మీకోసం మంచి ఆఫర్ ఉంది. రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్ ‌ఫోన్ మీద భారీగా డిస్కౌంట్ ఉంది.
రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్

రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్

సంక్రాంతి పండుగకు ముందే రెడ్‌మీ పలు ఫోన్ల మీద డిస్కౌంట్ అందిస్తోంది. తాజాగా రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్ కొనుగోలుపై మంచి తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్‌లో 23 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ చౌకైన రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్ 9 వేలకంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.

రెడ్‌మీ ఏ4 5జీ ఫీచర్లు

రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6.88 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5160mAh బ్యాటరీ, 128జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 1640 X 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.

రెడ్‌మీ ఏ4 5జీ మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో జీపీయూని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్ ఉంది. 4జీబీ వరకు వర్చువల్ ర్యామ్ మద్దతు కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 64జీబీ, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఈ మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Redmi A4 5G ఫోన్ 5160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, 33W అడాప్టర్ అందిస్తారు. నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం ఐపీ52 రేటింగ్‌ను కలిగి ఉంది.

ధరలు చూసుకుంటే..

రెడ్‌మీ ఏ4 5జీ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో విక్రయిస్తున్నారు. 4జీబీ ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ 23 శాతం డిస్కౌంట్‌తో ధర రూ.8,499గా ఉంది. 4జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 21 శాతం డిస్కౌంట్‌తో రూ.9,499కి ఉంది. ఈ మొబైల్ స్పార్కిల్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. అమెజాన్‌లో ఈ ఆఫర్‌లన్నింటినీ పొందవచ్చు.

గమనిక : ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆధారంగా ధరలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ ఆఫర్ మారవచ్చు. డిస్కౌంట్ ఎక్కువ అవ్వొచ్చు, తక్కువ అవ్వొచ్చు.

తదుపరి వ్యాసం