Poco M6 5G : పోకో ఎం6 5జీ లాంచ్ డేట్ ఫిక్స్- సూపర్ కూల్ ఫీచర్స్‌తో..!
22 December 2023, 12:07 IST
- Poco M6 5G launch date in India : పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్‌ని సంస్థ రివీల్ చేసింది. ఆ వివరాలు..
పోకో ఎం6 5జీ లాంచ్ డేట్ ఫిక్స్.. సూపర్ కూల్ ఫీచర్స్‌తో..!
Poco M6 5G launch date in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో.. మంచి జోరు మీద ఉంది! సీ65 పేరుతో.. ఇండియాలో ఇటీవలే ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసిన ఆ సంస్థ.. ఇప్పుడు మరో గ్యాడ్జెట్‌ని సిద్ధం చేస్తోంది. దీని పేరు పోకో ఎం6 5జీ. ఈ మోడల్.. ఈ నెల 22న ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. పోకో ఎం6 5జీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
పోకో ఎం6 5జీ ఫీచర్స్ ఇవేనా..?
ఇండియాలో.. పోకో ఎం సిరీస్‌లో 5జీ కనెక్టివిటీతో వస్తున్న రెండో గ్యాడ్జెట్ ఈ పోకో ఎం6. రూమర్స్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ఉండొచ్చు.
Poco M6 5G price in India : పోకో ఎం6 5జీ అనేది రెడ్మీ 13సీ 5జీకి రిబ్రాండెడ్ వర్షెన్ అని వార్తలు వస్తున్నాయి. ఇందులో.. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్ ఇందులో ఉండనుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇచ్చే ఫ్రెంట్ కెమెరా వివరాలపై క్లారిటీ లేదు.
మరోవైపు.. ఈ పోకో ఎం6లో సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందట. 10వాట్ ఛార్జర్, టైప్ సీ పోర్ట్ వంటివి బాక్స్‌తో పాటు వస్తాయట. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ- 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
Poco M6 5G features : పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ పెద్దన్న పోకో ఎం6 ప్రో 5జీ.. ఇప్పటికే ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. 4 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
పోకో ఎం6 ధర ఎంతంటే?
పోకో ఎం6 5జీ ధరపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కాగా.. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ అని ధర రూ. 10వేల రేంజ్లో ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
Poco M6 price : ధరతో పాటు ఫీచర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు.. లాంచ్ సమయంలో రీవిల్ అవుతాయి.
పోకో సీ65 ఫీచర్స్ చూశారా..?
ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉంటాయి. ఇక ఈ గ్యాడ్జెట్లో.. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.