తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco F6 Vs Poco X6 Pro : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Poco F6 Vs Poco X6 Pro : ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

02 June 2024, 14:40 IST

google News
  • Poco F6 Vs Poco X6 Pro : పోకో ఎఫ్6 వర్సెస్ పోకో ఎక్స్6 ప్రో.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? (Aishwarya Panda/ HT Tech)

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Poco F6 price in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో కస్టమర్స్​కి ఇప్పుడు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. వాటిల్లో.. పోకో ఎఫ్​6 సిరీస్​కి ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపత్యంలో ఈ పోకో ఎఫ్​6ని పోకో ఎక్స్​6 ప్రోతో పోల్చి ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

పోకో ఎఫ్6 వర్సెస్ పోకో ఎక్స్6 ప్రో..

డిస్ల్పే: పోకో ఎక్స్6 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్​నెస్​తో పాటు 6.67 ఇంచ్​ 1.5 కె అమోలెడ్ డిస్ల్పేతో వస్తుంది. పోకో ఎఫ్6 స్మార్ట్​ఫోన్​.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో పాటు 6.67 ఇంచ్​ 1.5కే అమోఎల్ఈడీ డిస్ల్పేతోఇటీవల లాంచ్ అయింది. రెండూ 446 పీపీఐ, 1220×2712 రిజల్యూషన్ ను అందిస్తాయి. పనితీరు పరంగా.. పోకో ఎక్స్ 6 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్​సెట్ తో వస్తోంది. అయితే పోకో ఎఫ్ 6 భారతదేశంలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్​తో వస్తున్న మొదటి స్మార్ట్​ఫోన్! ఈ రెండు స్మార్ట్​ఫోన్​లు 8 జీబీ / 12 జీబీ ర్యామ్, 512 జీబీ యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​ని అందిస్తాయి.

Poco X6 pro price in India : కెమెరా: పోకో ఎఫ్6 డ్యూయల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ఉన్నాయి. పోకో ఎక్స్6 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో వస్తుంది. ముందువైపు పోకో ఎఫ్6లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పోకో ఎక్స్6 ప్రోలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి.

బ్యాటరీ: ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే పోకో ఎఫ్6లో 90వాట్ ఛార్జింగ్ సపోర్ట్, పోకో ఎక్స్6 ప్రోలో 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Poco F6 features : ధర: పోకో ఎఫ్6 ప్రారంభ ధర రూ.29,999. కాగా, పోకో ఎక్స్6 ప్రో ప్రారంభ ధర రూ.26,999గా ఉంది.

పోకో ఎఫ్6, పోకో ఎక్స్6 ప్రో మధ్య కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్లు ఇవి. అయితే ఈ రెండు స్మార్ట్​ఫోన్లు ఆశాజనకమైన పనితీరును కనబరుస్తాయి.

వివో ఎస్19, ఎస్​ 19ప్రో లాంచ్..

Vivo latest smartphones : వివో తన లేటెస్ట్ స్మార్ట్​ఫోన్స్​.. వివో ఎస్​19, వివో ఎస్19 ప్రోలను చైనాలో లాంచ్​ చేసింది. 50 మెగాపిక్సెల్ రియర్, సెల్ఫీ కెమెరాలు, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4తో పనిచేస్తాయి. డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టిన వివో ఎస్18 లైనప్​ని అనుసరిస్తూ.. ఈ మోడల్స్​లో కూడా పలు కీలక ఫీచర్స్​ని కొనసాగించింది వివో సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం