OnlyFans లో వీడియోలు చేస్తూ రోజుకు రూ. 1కోటి సంపాదిస్తున్న 20ఏళ్ల ‘స్టార్’!
Published Dec 01, 2024 01:40 PM IST
OnlyFans star Sophie Rain : ఓన్లీఫ్యాన్స్ స్టార్ సోఫీ రెయిన్ సంపద తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఈమె రోజుకు రూ. 1కోటి కన్నా ఎక్కువే సంపాదిస్తోంది. ఇది ఇండియాలోనే అత్యంత భారీ జీతం తీసుకుంటున్న సీఈఓ కన్నా ఎక్కువ!
ఓన్లీఫ్యాన్స్ స్టార్ సోఫీ రెయిన్
ఇంగ్లాండ్‌కి చెందిన ఓన్లీఫాన్స్ అనే సబ్స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే, ఈ ఓన్లీఫ్యాన్స్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తూ చాలా మంది కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇక ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్ స్టార్ “సోఫీ రెయిన్” సంపద వివరాలు బయటకు వచ్చాయి. ఈ 20ఏళ్ల సోఫీ.. ఓన్లీఫ్యాన్స్‌లో వీడియో చేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 367కోట్లు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ అమెరికన్ క్రియేటర్ రోజుకు రూ. 1కోటికన్నా ఎక్కువే సంపాదిస్తున్నట్టు!
భారత్‌లో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓ సంపాదనతో సోఫీ పందను పోల్చి చూస్తే ఇది దాదాపు రెట్టింపు అని స్పష్టమవుతుంది. భారతదేశంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓ.. సంవత్సరానికి సుమారు రూ .186 కోట్లు (12 జనవరి 2023 నాటికి) అని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీటిల్లో కంపెనీ షేర్లే అధికంగా ఉండొచ్చు.
అయితే సోఫీ రెయిన్ జీవితం ఎప్పుడూ డబ్బుల మధ్య గడవలేదు! ఆమె చాలా కష్టాలను చూసింది.
సోఫీ రెయిన్ ఎవరు?
సోఫీ రెయిన్ తన ముగ్గురు తోబుట్టువులతో ఒక ఇంటిని పంచుకుంటూ యునైటెడ్ స్టేట్స్లో ఒక సాధారణ కుటుంబంలో పెరిగింది. ఆమె కుటుంబం జీవనోపాధి కోసం ఆహార స్టాంపులపై ఆధారపడేది. కేవలం 17 సంవత్సరాల వయస్సులో రెయిన్ ఆర్థికంగా సహాయపడటానికి మినిమమ్ జీతంతో వెయిట్రెస్‌గా ఉద్యోగంలో చేరింది.
ఓన్లీఫ్యాన్స్ స్టార్ సోఫీ రెయిన్.. ఏప్రిల్ 2023లో ఆమె తన చెల్లెలు సియెర్రాతో కలిసి కంటెంట్ చేయడం ప్రారంభించింది. అది ఆమె జీవితాన్ని మార్చేసింది. రెయిన్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల ఆమెకు త్వరగా భారీ ఫాలోయింగ్ వచ్చింది. ఇది ఆమెను స్టార్డమ్, ఆర్థిక విజయానికి దారితీసింది.
రెయిన్ ఆర్థికంగా ఎదగడం ఆమె కుటుంబానికి గణనీయమైన మద్దతును అందించడానికి వీలు కల్పించింది. రెస్టారెంట్ పనులు చూసుకునే తన తండ్రి అప్పులను రెయిన్ తీర్చింది.
సోఫీ రెయిన్ తన డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తుంది?
ఓన్లీఫ్యాన్స్ స్టార్ సోఫీ రెయిన్ లగ్జరీ కార్లలో తిరుగుతూ కనిపించొచ్చు. విలాసవంతమైన విందులు ఇస్తూ కనిపించొచ్చు. కానీ ఆమె తన భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ కూడా చేస్తుంది. తన సంపాదనలో 70శాతం వరకు ఆమె ఇన్వెస్ట్ చేస్తోందట.
రెయిన్ సోషల్ మీడియా ప్రభావం అపారమైనది! ఓన్లీఫాన్స్లో 11 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్, 5.2 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు, ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సంపాదన స్క్రీన్ షాట్‌తో పాటు ఇతర వైరల్ పోస్ట్‌లు 14.6 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించాయి. ఇది ఆన్లైన్లో విస్తృత చర్చకు దారితీసింది.
రెయిన్ కథ చాలా మందిలో ప్రతిధ్వనించింది. వినియోగదారులు ఆమె వైరల్ పోస్టైపై కామెంట్లు చేస్తున్నారు. ఓన్లీఫాన్స్ పాపులారిటీ పెరుగుతుండటంతో సోఫీ రెయిన్ వంటి క్రియేటర్లు ఇలాంటి అసాధారణ విజయంతో వచ్చే అవకాశాలు, బాధ్యతలను హైలైట్ చేస్తున్నారు.