తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Share Price: ఒక్క రోజే 20% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర; కారణం ఇదే..

Ola Electric share price: ఒక్క రోజే 20% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర; కారణం ఇదే..

Sudarshan V HT Telugu

27 November 2024, 14:49 IST

google News
  • Ola Electric share price: గత కొన్ని వారాలుగా నేల చూపులు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర బుధవారం, నవంబర్ 27న ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర ఒక్క రోజే 18% పెరిగింది. విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ధర ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటి?..

ఒక్క రోజే 20% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర
ఒక్క రోజే 20% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర (REUTERS)

ఒక్క రోజే 20% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర

Ola Electric share price: ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ధర బుధవారం ఒక్కసారిగా దాదాపు 18% పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం నవంబర్ 26, మంగళవారం గిగ్, ఎస్ 1 జెడ్ అనే రెండు కొత్త మోడల్ ఈ- స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించడమే. అంతేకాకుండా, వీటిలో ఒక మోడల్ ధర రూ .39,000 నుండి ప్రారంభమవుతుంది. చవకైన ఈ స్కూటర్ లాంచ్ తో మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేరు ధర బుధవారం బీఎస్ఈ లో రూ .77.71 వద్ద ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు రూ .73.47 తో పోలిస్తే 5% ఎక్కువ. ఆ తర్వాత, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఈ షేరు 20 శాతం లాభపడి రూ.88.18 వద్ద కు చేరుకుంది. మొత్తానికి ఐపీఓ ధర అయి రూ.76 ను మరోసారి క్రాస్ చేసింది.

కొత్త శ్రేణి స్కూటర్లు; వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ నవంబర్ 26 న విడుదల చేసిన ప్రకటనలో ఓలా గిగ్, ఓలా గిగ్ +, ఓలా ఎస్ 1 జెడ్, ఓలా ఎస్ 1 జెడ్ ప్లస్ లను వరుసగా రూ .39,999, రూ .49,999, రూ .59,999, రూ .64,999 ప్రారంభ ధరలతో ప్రారంభించింది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ధరలని గమనించాలి.

బుకింగ్స్ ప్రారంభం

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కొత్తగా లాంచ్ చేసిన గిగ్, ఎస్ 1 జెడ్ సిరీస్ రెండింటికీ ప్రి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు నవంబర్ 26 వ తేదీ నుండి కేవలం రూ .499 చెల్లించి ఈ మోడల్స్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే, డెలివరీలు ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త శ్రేణి స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో సహా మన్నికైన, నమ్మదగిన, సరసమైన, సౌకర్యవంతమైన పరిష్కారాలను అందిస్తాయి. గ్రామీణ, సెమీ-అర్బన్, పట్టణ వినియోగదారుల వ్యక్తిగత, వాణిజ్య వినియోగ అవసరాలను నెరవేరుస్తాయని కంపెనీ పేర్కొంది.

పోర్టబుల్ బ్యాటరీ

ఓలా ఎలక్ట్రిక్ (ola electric) కొత్త శ్రేణి స్కూటర్ల (electric scooter) లో పోర్టబుల్ బ్యాటరీలు పొందుపర్చారు. ఇవి ఓలా పవర్ పాడ్ ను ఉపయోగించి ఇన్వర్టర్ గా కూడా మారగలవు. ఓలా గిగ్, ఓలా ఎస్ 1 జెడ్ స్కూటర్లతో పాటు ప్రస్తుత ఈవీ పోర్ట్ ఫోలియోతో భారత్ లోని ఈవీ కస్టమర్ల అవసరాలను తీర్చడానికిి సిద్ధంగా ఉన్నామని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

తదుపరి వ్యాసం