తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Morgan Stanley: ఈ 4 స్టాక్స్ లో పెట్టుబడి పెడితే కాపెక్స్ బూమ్ తో లాభాలు గ్యారెంటీ అంటున్న మోర్గాన్ స్టాన్లీ

Morgan Stanley: ఈ 4 స్టాక్స్ లో పెట్టుబడి పెడితే కాపెక్స్ బూమ్ తో లాభాలు గ్యారెంటీ అంటున్న మోర్గాన్ స్టాన్లీ

HT Telugu Desk HT Telugu

20 June 2024, 14:53 IST

google News
  • India's capex boom: గత దశాబ్ద కాలంగా భారత్ లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఈ కాపెక్స్ బూమ్ తో పలు ఇన్ ఫ్రా స్టాక్స్ భారీగా లాభపడుతాయని తెలిపింది.

మోర్గాన్ స్టాన్లీ సూచిస్తున్న 4 స్టాక్స్
మోర్గాన్ స్టాన్లీ సూచిస్తున్న 4 స్టాక్స్ (Reuters)

మోర్గాన్ స్టాన్లీ సూచిస్తున్న 4 స్టాక్స్

India's capex boom: పీఎం గతి శక్తి వంటి ప్రాజెక్టుల కారణంగా భారతదేశ మౌలిక సదుపాయాలు, మూల ధన వ్యయం పుంజుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ కాపెక్స్ బూమ్ వల్ల లార్సెన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, టిటాఘర్ రైల్ సిస్టమ్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి స్టాక్స్ భారీగా లాభపడుతాయని వెల్లడించింది.

మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు

గత దశాబ్ద కాలంగా భారత్ లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని మోర్గాన్ స్టాన్లీ గురువారం పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5.3 శాతం ఉండగా, అవి 2029 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 6.5 శాతానికి పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బలమైన 15.3 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (CAGR) ను ప్రతిబింబిస్తుంది.

మోర్గాన్ స్టాన్లీ సూచిస్తున్న స్టాక్స్:

1. ఎల్ అండ్ టీ

మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం పెరగడం ఎల్ అండ్ టికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థలో మొత్తం మెరుగుదల కూడా ఎల్ అండ్ టికి సానుకూల చోదక శక్తిగా ఉంటుంది.

2. ఎన్టీపీసీ

మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు (SEB) మెరుగుపడడం, విలువ ఆధారిత కొనుగోళ్లు, అనుబంధ సంస్థల్లో వాల్యూ అన్ లాక్ వంటి కారణాల వల్ల ఎన్టీపీసీకి అవకాశాలు మెరుగవుతాయి.

3. టిటాఘర్ రైల్ సిస్టమ్స్

మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం టిటాఘర్ రైల్ సిస్టమ్స్ కు ఉపయోగపడుతుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ స్టాక్ కు బలమైన ఆదాయ విజిబిలిటీ ఉందని, రాబడి నిష్పత్తులను మెరుగుపడ్తాయని తెలిపింది. అంచనాలకు మించి ప్యాసింజర్ సెగ్మెంట్ మార్జిన్లు పెరగడం కంపెనీ ఆర్థిక పనితీరును మరింత మెరుగుపరుస్తుందని విదేశీ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

4. అల్ట్రాటెక్ సిమెంట్

మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల వల్ల సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది. దాంతో పాటు ఇన్ పుట్ ధరలు గణనీయంగా తగ్గడంతో అల్ట్రాటెక్ సిమెంట్ కు మధ్యకాలిక డిమాండ్ విజిబిలిటీ బలంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

తదుపరి వ్యాసం