తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Windsor Ev Vs Tata Punch Ev : ఈ రెండు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు?

MG Windsor EV vs Tata Punch EV : ఈ రెండు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు?

Sharath Chitturi HT Telugu

20 September 2024, 6:40 IST

google News
    • MG Windsor EV vs Tata Punch EV : ఎంజీ విండ్సర్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ.. ఈ రెండు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ విండ్సర్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ..
ఎంజీ విండ్సర్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ..

ఎంజీ విండ్సర్​ ఈవీ వర్సెస్​ టాటా పంచ్​ ఈవీ..

ఇండియా ఆటోమొబైల్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో లేెటెస్ట్​ ఎంట్రీ అయిన ఎంజీ విండ్సర్​ ఈవీపై కస్టమర్ల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఎంజీ విండ్సర్ ఈవి భారతీయ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఉత్సాహాన్ని జోడిస్తూనే.. ఇతర కంపెనీలకు గట్టిపోటీనిస్తోంది. మరీ ముఖ్యంగా టాటా మోటార్స్​లోని పలు బెస్ట్​ సెల్లింగ్​ ఈవీలకు ఎంజీ విండ్సర్​ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్ ప్రస్తుతం 85 శాతం వాటాతో మార్కెట్​ షేర్​ కలిగి ఉంది. దేశీయ ఆటోమొబైల్ తయారీదారు నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీతో సహా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. టాటా పంచ్ ఈవీ, మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు, ఎంజీ విండ్సర్ విడుదలతో టాటా పంచ్​ గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఎంజీ విండ్సర్​ని టాటా పంచ్​ ఈవీతో పోల్చి, ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ ఈవీ: ధర

ఎంజీ విండ్సర్ ఈవీ మూడు ట్రిమ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎస్​యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, బ్యాటరీ సబ్​స్క్రిప్షన్ కిలోమీటర్​కు రూ.3.5 లక్షలు! టాటా పంచ్ ఈవీ ధర రూ .9.99 లక్షల నుంచి రూ .14.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఫలితంగా ప్రైజ్​ విషయంలో రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.

ఏదేమైనా, విండ్సర్ ఈవీ ఫుల్​ ప్రైజ్​ లిస్ట్​ని ఎంజీ మోటార్స్​ ఇంకా ప్రకటించలేదు. ఇది వాహనం ధరకు అదనంగా బ్యాటరీ సబ్​స్క్రిప్షన్ ప్రోగ్రామ్​తో వస్తుంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఏ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. డబ్బుకు మంచి విలువను అందిస్తుందో చూడాలి.

ఇదీ చూడండి:- BMW X7 Signature Edition: భారత్ లో బిఎమ్ డబ్ల్యూ ఎక్స్ 7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్; ధర ఎంతంటే?

ఎంజీ విండ్సర్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ ఈవీ: స్పెసిఫికేషన్లు..

ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 134బీహెచ్​పీ పవర్, 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

మరోవైపు, టాటా పంచ్ ఈవీ 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తోంది. ఈ ఈవీలోని 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 80బీహెచ్​పీ పవర్, 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ ట్రిమ్ మరింత శక్తివంతమైన మోటారును పొందుతుంది. ఇది 120 బిహెచ్​పీ పీక్​ పవర్​, 190 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పంచ్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది.

తదుపరి వ్యాసం