Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్‌యూవీ300కి 'ఈవీ' టచ్.. త్వరలోనే లాంచ్!
11 December 2023, 12:46 IST
- Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీని సంస్థ సిద్ధం చేస్తోందని టాక్! మరికొన్నినెలల్లో ఇది లాంచ్ అవుతుందని సమాచారం.
మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఈవీ టచ్.. త్వరలోనే లాంచ్!
Mahindra XUV300 EV launch date in India : ఇండియాన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే పలు మోడల్స్‌ని లైనప్‌లో పెట్టింది. ఇక ఇప్పుడు.. మరో ఈవీపై సంస్థ పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఈవీ టచ్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకుందట! అంతేకాకుండా.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని 2024 జూన్‌లోపే లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ..
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ డిజైన్.. ప్రస్తుతం ఉన్న ఐసీఈ ఇంజిన్ మోడల్‌తోనే పోలి ఉండే అవకాశం ఉంది. డ్రాప్-డౌన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉండొచ్చు. బంపర్, హెడ్‌ల్యాంప్, గ్రిల్ వంటివి మారే అవకాశం ఉంది. రేర్‌లో టెయిల్‌గేట్ సరికొత్తగా ఉండనుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్లేట్‌ని పెట్టే ప్లేస్‌ని కూడా మార్చే అవకాశం లేకపోలేదు.
Mahindra XUV300 EV price in India : ఇక ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ కేబిన్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఏసీ వెంట్స్, స్విచ్‌గేర్, సెంటర్ కన్సోల్లు ఇందులో సాధారణంగానే ఉండనున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రాకు ప్రస్తుతం ఒక్కటే ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉంది. అది.. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ. ఇందులో 40కేడబ్ల్యూహెచ్ బ్యారీ ఉంటుంది. కాగా.. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీలో 35 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుదని టాక్ నడుస్తోంది. దీని రేంజ్‌కు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ధర ఎంత ఉంటుంది?
Mahindra XUV300 EV range : ఇండియాలో.. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా.. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 15లక్షలు- రూ. 18లక్షల మధ్యలో ఉండొచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఎక్స్‌షోరూం ధర దీని కన్నా రూ. 2లక్షలు ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు.. ఎక్స్‌యూవీ300 ఐసీఈ మోడల్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కూడా రాబోతోంది. 2024 ఫిబ్రవరిలో దీనిని సంస్థ లాంచ్ చేస్తుందని సమాచారం.
Mahindra XUV300 EV full specifications : అయితే.. ఈ ఈవీ, ఐసీఈ ఇంజిన్ల ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.