IRCTC booking: రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ నిబంధనల్లో కీలక మార్పు; ఇకపై అలా కుదరదు..
17 October 2024, 16:46 IST
IRCTC booking: రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కు సంబంధించి ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ నిబంధనల్లో కీలక మార్పు
IRCTC booking: రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని నవంబర్ 1 నుంచి 60 రోజులకు తగ్గించారు. గతంలో ఈ వ్యవధి 120 రోజులు ఉండేది. ఆ వ్యవధిని ఇప్పుడు తగ్గించారు. ఇకపై రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని నవంబర్ 1 నుంచి 60 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఈ నిబంధన నవంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
వీరికి వర్తించదు..
కాగా, ఈ నిబంధన నవంబర్ 31 నుంచి అమల్లోకి వస్తున్నందున, అప్పటివరకు 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుని, ఇప్పటికే బుక్ చేసుకున్నవారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి బుకింగ్ రద్దు చేయడం జరగదని స్పష్టం చేశారు. వారు తమ బుకింగ్ ప్రకారం ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చని తెలిపారు.
విదేశీ పర్యాటకులకు..
విదేశీ పర్యాటకులకు రైల్వే అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం 365 రోజులుగా ఉంది. అంటే వారు, 365 రోజుల ముందే, తమ ప్రయాణాలకు రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వారికి ఈ సదుపాయం కొనసాగుతుందని, వారికి 60 రోజుల నిబంధన వర్తించదని రైల్వే (RAILWAY)అధికారులు తెలిపారు. కాగా, 60 రోజుల నిబంధన వార్తతో స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ (IRCTC) షేర్లు దాదాపు 2% క్షీణించాయి. వ్యవధి నాలుగు నెలల నుంచి రెండు నెలలకు తగ్గడం వల్ల క్యాన్సిలేషన్ ఆదాయం తగ్గుతుందని, ఆ కారణంగానే ఐఆర్సీటీసీ షేర్ల ధరలు తగ్గాయని నిపుణులు వివరించారు.