తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Smartphone : ఇండియాలో ఇదే ది బెస్ట్​ ‘ఆల్​రౌండ్​’ స్మార్ట్​ఫోన్​! సూపర్​ ఫీచర్స్​తో..

New smartphone : ఇండియాలో ఇదే ది బెస్ట్​ ‘ఆల్​రౌండ్​’ స్మార్ట్​ఫోన్​! సూపర్​ ఫీచర్స్​తో..

Sharath Chitturi HT Telugu

08 November 2024, 6:05 IST

google News
  • iQOO 13 India : ఐక్యూ 13 ఈ డిసెంబర్​లో భారత్​లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లతో పాటు ఇతర వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలో ఇదే ది బెస్ట్​ ‘ఆల్​రౌండ్​’ స్మార్ట్​ఫోన్​!
ఇండియాలో ఇదే ది బెస్ట్​ ‘ఆల్​రౌండ్​’ స్మార్ట్​ఫోన్​! (iQOO)

ఇండియాలో ఇదే ది బెస్ట్​ ‘ఆల్​రౌండ్​’ స్మార్ట్​ఫోన్​!

ఇటీవల చైనాలో అరంగేట్రం చేసిన ఐక్యూ 13 స్మార్ట్​ఫోన్​.. ఈ డిసెంబర్​లో భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే అమెజాన్ ఇండియాలో లిస్టింగ్​ అయ్యింది. కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 13 మధ్యలో ఐక్యూ 13 లాంచ్​ డేట్​ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐక్యూ ఫోన్ ఫీచర్లను టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐక్యూ 13: కలర్ ఆప్షన్స్

ఇండియన్ మార్కెట్​లో ఐక్యూ 13 రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. కంపెనీ లెజెండ్ ఎడిషన్​గా బ్రాండింగ్ చేస్తున్న వైట్ వేరియంట్, గ్రే ఆప్షన్. చైనాలో అందుబాటులో ఉన్న మోడల్​కి ఇవి సూట్​ అవుతాయి.

ఐక్యూ 13: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)..

స్పెసిఫికేషన్ల పరంగా భారత్​లో లాంచ్ కానున్న ఐక్యూ 13 స్మార్ట్​ఫోన్​ చైనా మోడల్​కు అద్దం పడుతుంది. ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ 6.82 ఇంచ్​ బీఓఈ క్యూ10 ఫ్లాట్ డిస్​ప్లేని కలిగి ఉంటుంది. ఇది స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​తో పనిచేస్తుంది. మెరుగైన గేమింగ్ పనితీరు కోసం క్యూ2 సూపర్ కంప్యూటర్ చిప్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. 144 ఎఫ్పిఎస్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్, 2కే సూపర్ రిజల్యూషన్​ని అందిస్తుంది. స్క్రీన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది స్మూత్ వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ అల్ట్రా ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో ఈ ఫోన్ పనిచేయనుంది.

ఐక్యూ 13 ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 1్​తో పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్​ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో సహా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్​ని కలిగి ఉండవచ్చు.

ఐక్యూ 13: భారతదేశంలో ధర (అంచనా)

భారతదేశంలో ఐక్యూ 13 ధరపై ఇంకా క్లారిటీ లేదు. చైనాలో ఈ ఫోన్ ధర 3,999 యువాన్లుగా(సుమారు రూ.47,000) ఉంది. భారత్ లో ఐక్యూ 12 ధర రూ.52,999గా ఉంది. ఐక్యూ 13 కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది! కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం బెటర్​.

ఈ మోడల్​ లాంచ్​ డేట్​, ఫీచర్స్​, ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే మేము మీకు చెబుతాము.

తదుపరి వ్యాసం