తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone Explodes: ఐఫోన్స్ కూడా పేలిపోతున్నాయి.. జాగ్రత్త!; ఈ తప్పులు చేయకండి

iPhone explodes: ఐఫోన్స్ కూడా పేలిపోతున్నాయి.. జాగ్రత్త!; ఈ తప్పులు చేయకండి

Sudarshan V HT Telugu

05 November 2024, 22:12 IST

google News
  • iPhone explodes: ఛార్జింగ్ చేస్తుండగా ఐఫోన్ పేలిన ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. షాంక్సీలో ఓ మహిళ తన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఛార్జింగ్ చేస్తుండగా, ఆ ఫోన్ పేలడంతో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సురక్షితమైనదిగా భావించే ఐఫోన్ కూడా పేలడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఐఫోన్స్ కూడా పేలుతున్నాయి
ఐఫోన్స్ కూడా పేలుతున్నాయి (HT Tech)

ఐఫోన్స్ కూడా పేలుతున్నాయి

iPhone explodes: చార్జింగ్ చేస్తుండగా ఓ మహిళ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పేలడంతో ఆమె చేతులు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఆమె బెడ్ కొంత కాలిపోయింది. ఆమె బెడ్ వెనుక గోడలు నల్లగా మారిపోయాయి. రాత్రి ఛార్జింగ్ పెట్టానని, ఉదయం 6:30 గంటలకు ఈ పేలుడు సంఘటన జరిగిందని ఆ యువతి తెలిపింది. ఈ ఐఫోన్ (iphone) ను తాను 2022 లో కొనుగోలు చేశానని చెప్పింది.

నిద్రలో ఉండగా..

రాత్రి చార్జింగ్ పెట్టిన ఐఫోన్ పేలడంతో అగ్నిమాపక విభాగం దర్యాప్తు చేసి, ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ వైఫల్యం అగ్నిప్రమాదానికి దారితీసిందని నిర్ధారించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆపిల్ సంస్థ స్పందించింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులు, వారంటీ పీరియడ్ తో సంబంధం లేకుండా, తమ పరికరాలను విశ్లేషణ కోసం తిరిగి ఇవ్వాలని కంపెనీ కోరింది.

ఇలాంటి ఘటనలు చాలానే..

ఛార్జింగ్ సమయంలో ఫోన్స్ పేలడం, లేదా కాలిపోవడం ఈ మధ్య సాధారణంగా మారింది. చైనాలో చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. జనవరి 28న జరిగిన మరో ఘటనలో హునాన్ ప్రావిన్స్లోని జియాంగ్టాన్లో ఓ జంటకు సాకెట్ లో ఉన్న చార్జర్ లో నుంచి మంటలు ఎగసి పడిన ప్రమాదం ఎదురైంది.

ఛార్జింగ్ సమయంలో జాగ్రత్తలు

ఛార్జింగ్ సమయంలో పేలుళ్లు, ఫోన్ కాలిపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో ఛార్జింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి జాగ్రత్తలు కొన్ని..

  • వినియోగదారులు తమ ఫోన్లను ఎక్కువసేపు ప్లగ్ ఇన్ చేయకుండా ఉండాలి.
  • ముఖ్యంగా రాత్రిపూట లేదా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అన్ ప్లగ్ చేయడం మంచిది.
  • పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్లను అన్ ప్లగ్ చేయడం మంచిది.
  • ఫోన్ లేదా ఛార్జర్ నుంచి మంటలు లేదా కాలిన వాసన రావడం గమనించినట్లయితే, వారు వెంటనే ఆ డివైజ్ ను వాడడం మానేసి, సంబంధిక కంపెనీకి ఫిర్యాదు చేయాలి.
  • ఛార్జింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ ను లేదా ట్యాబ్ ను ఉపయోగించకూడదు.

తదుపరి వ్యాసం