TV Discount : ఇంట్లో పెద్ద టీవీ కావాలా? సోనీ, శాంసంగ్, వన్‌ప్లస్‌పై 56 శాతం వరకు డిస్కౌంట్
04 August 2024, 19:30 IST
Discounts On TV : సోనీ, శాంసంగ్, వన్ ప్లస్ వంటి కంపెనీల టీవీలను 56 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలపై మంచి బ్యాంక్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. ఈ టీవీలపై అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మీరు పెద్ద డిస్‌ప్లేతో టీవీని పొందాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్ మీ కోసం ఎదురుచూస్తోంది. ఈ బంపర్ డీల్‌లో మీరు సోనీ, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి కంపెనీల టీవీలను 56 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలపై బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. అలాగే ఈఎంఐలోనూ ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ సేల్‌లో ఈ టీవీలపై ఎక్స్చేంజ్ బోనస్‌లను కూడా భారీగా అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత టీవీ, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
వన్ ప్లస్ టీవీ
వన్ ప్లస్ 163 సెం.మీ (65 అంగుళాలు) క్యూ సిరీస్ 4కె అల్ట్రా హెచ్ డి క్యూఎల్ ఇడి స్మార్ట్ గూగుల్ టీవీ 65 క్యూ2 ప్రో (బ్లాక్). ఈ 65 అంగుళాల టీవీ అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో ఎంఆర్పీ నుండి 56 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దీంతో ధర రూ.69,999కు వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో టీవీ ధరను 2 వేల రూపాయల వరకు తగ్గించవచ్చు. ఈ సేల్‌లో టీవీలో రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.2020 వరకు మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. ఆకర్షణీయమైన ఈఎంఐలపై కూడా టీవీ సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ టీవీ
శాంసంగ్ 163 సెంమీ (65 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ నియో క్యూఎల్ ఈడీ టీవీ QA65QN90BAKLXL (టైటాన్ బ్లాక్). ఈ శాంసంగ్ టీవీ ప్రీమియం కేటగిరీలో వస్తుంది. ఈ సేల్‌లో ఎంఆర్పీ కంటే 52 శాతం తక్కువ ధరకు లభిస్తుంది. దీన్ని రూ.1,46,990కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో రూ.1500 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. రూ.7350 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా టీవీలో ఉంది. మీరు ఈ టీవీని రూ .2020 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. డాల్బీ అట్మాస్‌తో ఈ టీవీ 60 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌ను కలిగి ఉంది.
సోనీ టీవీ
సోనీ బ్రావియా 164 సెం.మీ (65 అంగుళాలు) 4కె అల్ట్రా హెచ్ డి స్మార్ట్ ఎల్ ఇడి గూగుల్ టీవీ కెడి-65X74ఎల్ (బ్లాక్). ఈ టీవీ ఎంఆర్పీ కంటే 44 శాతం చౌక ధరకు లభిస్తుంది. దీన్ని రూ.77,990కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ టీవీపై రూ.2 వేల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ టీవీ ధరను రూ.7,200 వరకు తగ్గించుకోవచ్చు. టీవీలో రూ.3900 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ టీవీ సులభమైన ఈఎంఐలపై కూడా మీ సొంతం కావచ్చు. ఈ సోనీ టీవీలో 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌తో ఓపెన్ స్పీకర్, డాల్బీ ఆడియో ఉన్నాయి.