తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor New Phones : హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. భయపడొద్దు.. బడ్జెట్ ధరలోనే

Honor New Phones : హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. భయపడొద్దు.. బడ్జెట్ ధరలోనే

Anand Sai HT Telugu

17 October 2024, 14:06 IST

google News
  • Honor New Phones : హానర్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. హానర్ ఎక్స్ 60, హానర్ ఎక్స్ 60 ప్రో కింద ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటి గురించి తెలుసుకుందాం..

హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్
హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్

హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్

హానర్ తన ఎక్స్60 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్‌‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. హానర్ ఎక్స్ 60, హానర్ ఎక్స్ 60 ప్రో. ఈ ఫోన్ చైనాలో ఎక్స్ 50 సిరీస్‌ తర్వాత అప్‌డేటెట్‌గా వచ్చింది. రెండు మోడళ్లు కెమెరా సెంట్రిక్, ఫోన్లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. స్టాండర్డ్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025-అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఎక్స్ 60 ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫోన్ ధర, అన్ని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకోండి.

హానర్ ఎక్స్ 60 సిరీస్ బేస్ 8జీబీ ప్లస్ 128జీబీ కాన్ఫిగరేషన్ మోడల్ ధర సుమారు రూ.14,000 నుంచి ప్రారంభమవుతుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ కిన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

హానర్ ఎక్స్60 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.18,000గా ఉంది. యాష్, బ్లాక్, ఆరెంజ్, సీ గ్రీన్ అనే నాలుగు రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

హానర్ ఎక్స్ 60 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఎక్స్60లో 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోడల్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

మరోవైపు హానర్ ఎక్స్60 ప్రోలో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఎక్స్60 ప్రో స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ 66వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. హానర్ ఎక్స్ 60 సిరీస్ రెండు మోడళ్లలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అందించారు.

తదుపరి వ్యాసం