తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Activa Ev : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేసిందోచ్.. అదిరిపోయే ఫీచర్లు

Honda Activa EV : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేసిందోచ్.. అదిరిపోయే ఫీచర్లు

Anand Sai HT Telugu

28 November 2024, 5:40 IST

google News
    • Honda Activa Electric Scooter : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చాలామంది వెయిట్ చేస్తు్న్నారు. తాజాగా కంపెనీ దీనిని విడుదల చేసింది. ఇందులో హోండా యాక్టివా ఈ, హోండా క్యూసీ1ను తీసుకొచ్చింది. వాటి వివరాలేంటో చూద్దాం..
హోండా యాక్టివా ఈవీ
హోండా యాక్టివా ఈవీ

హోండా యాక్టివా ఈవీ

హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. హోండా యాక్టివా ఈ, హోండా క్యూసీ1ను తీసుకొచ్చారు. ఈ కొత్త స్కూటర్ కోసం చాలా మంది అనేక రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇందులో హోండా యాక్టివా E మార్చుకోదగిన బ్యాటరీతో వస్తుంది. అయితే హోండా QC1 స్థిరమైన బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంది. శక్తిని పొందడానికి ఛార్జింగ్ కేబుల్‌పై ఆధారపడుతుంది.

హోండా యాక్టివా ఈ ఒక సరికొత్త మోడల్‌గా పరిచయం చేశారు. హోండా యాక్టివా ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు కంపెనీ అదే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటర్ పేరు మాత్రమే కాకుండా దాని ICE మోడల్, బాడీ, ఫ్రేమ్‌ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ ఈవీ స్టైలింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది రెండు వైపులా టర్న్ ఇండికేటర్‌లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. స్కూటర్ హెడ్ మీద LED DRL కూడా వస్తుంది.

ఇందులో డ్యూయల్ టోన్ సీటు, 12-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, బలమైన గ్రాబ్రెయిల్స్ వంటి అంశాలు ఉన్నాయి. ఇది 7.0-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్‌ను కూడా పొందుతుంది. హోండా రోడ్‌సింక్ డ్యుయో యాప్‌తో రియల్‌టైమ్ కనెక్టివిటీని అందిస్తుంది. రైడర్‌లు కనెక్ట్ అయి, అప్‌డేట్‌గా ఉండటానికి అనుమతిస్తుంది.

బైక్ వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్ యూనిట్‌లో Activa E బ్యాడ్జ్‌ను చూడవచ్చు. సీటు కింద Activa E 4.2 kW (5.6 bhp) పవర్ అవుట్‌పుట్‌తో, రెండు 1.5 kWh బ్యాటరీలతో కూడిన స్వాప్ చేయగల బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంది. ఈ అవుట్‌పుట్ గరిష్టంగా 6.0 kW (8 bhp)కి పెంచబడుతుంది. హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 102 కిమీల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. సుమారు లక్ష రూపాయల ధరతో విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్థిరమైన 1.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక ఛార్జర్‌ను కలిగి ఉంది. దీనిని ఫ్లోర్‌బోర్డ్‌లో ఉంచిన సాకెట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. బ్యాటరీ నుండి శక్తి 1.2 kW (1.6 bhp), 1.8 kW (2.4 bhp) పవర్ అవుట్‌పుట్‌లతో కాంపాక్ట్ ఇన్-వీల్ మోటార్‌లకు బదిలీ అవుతుంది. ఈ ఇ-స్కూటర్ 80 కి.మీ రేంజ్ ఇవ్వగలదు. క్యూసీ1 5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా రైడర్‌కు ఈజీగా ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్ సీ సాకెట్‌లాంటి ఫీచర్లను అందిస్తుంది.

తదుపరి వ్యాసం