GST revenue: అక్టోబర్ లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు
01 November 2023, 17:22 IST
GST revenue in October: పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) వసూలు అయింది. మొత్తంగా అక్టోబర్ 2023లో 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది.
ప్రతీకాత్మక చిత్రం
GST revenue in October: భారత్ లో జీఎస్టీ (GST) వసూళ్లు ప్రతీ నెల కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ అక్టోబర్ నెలలో మొత్తంగా రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం మరో రికార్డు. ఇప్పటివరకు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ( April, 2023) వసూలైన జీఎస్టీనే అత్యధికం. కాగా, ఈ అక్టోబర్ లో వసూలైన రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ రెండో అత్యధిక మొత్తం కావడం విశేషం. గత సంవత్సరం అక్టోబర్ నెలలో వసూలైన జీఎస్టీ తో పోలిస్తే ఈ అక్టోబర్ లో 13% ఎక్కువ జీఎస్టీ వసూలు అయింది.
జీఎస్టీ వివరాలు..
ఈ అక్టోబర్ నెలలో వసూలైన రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీలో.. రూ. 30,062 కోట్లు సీజీఎస్టీ (Central goods and services tax- CGST) కాగకా, రూ. 38,171 కోట్లు ఎస్ జీఎస్టీ (State Goods and Services Tax- SGST), రూ. 91,315 కోట్లు ఐజీఎస్టీ (Integrated Goods and Services Tax - IGST). అలాగే, రూ. 12,456 కోట్లు సెస్ గా వసూలు అయింది. మొత్తంగా అక్టోబర్ నెలలో కేంద్రం జీఎస్టీ ఆదాయం రూ. 72,934 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం రూ. 74,785 కోట్లు.