తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Android Xr: గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్; ఇది రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఓఎస్ లాంటిది మాత్రం కాదు..

Android XR: గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్; ఇది రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఓఎస్ లాంటిది మాత్రం కాదు..

Sudarshan V HT Telugu

13 December 2024, 20:41 IST

google News
  • గూగుల్ కొత్తగా ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఓఎస్ ను రూపొందించింది. ఈ ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రత్యేకంగా ఏఆర్, వీఆర్ వినియోగదారుల కోసం రూపొందించారు. దీనిని శాంసంగ్ సహకారంతో గూగుల్ రూపొందించింది.

గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్
గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ (Android)

గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అనేది గూగుల్ నుండి వస్తున్న తాజా ఆపరేటింగ్ సిస్టమ్. కానీ ఇది మీ సాధారణ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇది నెక్ట్స్ జనరేషన్ కంప్యూటింగ్ కోసం రూపొందించిన పూర్తిగా కొత్త ఓఎస్ ఇది. శాంసంగ్ సహకారంతో అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్రత్యేకంగా ఏఆర్, వీఆర్ వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది హెడ్ సెట్స్, గ్లాసెస్ కోసం రూపొందించారు. అయితే, దీని సామర్థ్యాలు ఈ డివైజెస్ ను మించి విస్తరించాయి.

ప్రస్తుతం ప్రి వ్యూ వర్షన్

ప్రస్తుతం, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్ల కోసం ప్రివ్యూ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఇది విస్తృత శ్రేణి సాధనాలకు మద్దతును అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ లో గూగుల్ జెమినీ

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఎలా పనిచేస్తుందనే దానిలో గూగుల్ జెమినీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మీరు మీ హెడ్సెట్ ఉపయోగించి ఏమి చూస్తున్నారు లేదా ఏమి నియంత్రిస్తున్నారనే దాని గురించి జెమినీతో సంభాషణలు జరపవచ్చు. జెమినీ మీ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, తదనుగుణంగా, విషయాలను ప్లాన్ చేయడానికి, తరువాత పరిశోధించడానికి మీకు సహాయపడుతుంది. తద్వారా మీరు కోరుకున్నట్లుగా మీకు మార్గనిర్దేశం చేస్తుందని గూగుల్ తెలిపింది.

3డీ లో గూగుల్ ఫోటోస్

ఈ అండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఓఎస్ కోసం యూట్యూబ్ సహా పలు పాపులర్ గూగుల్ యాప్స్ ను గూగుల్ రీడిజైన్ చేస్తోంది. యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్, విజన్ ఓఎస్ లలో యూట్యూబ్ ను వర్చువల్ బిగ్ స్క్రీన్ పై వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ లో వస్తున్న మరో ప్రధాన ఫీచర్ 3డిలో గూగుల్ ఫోటోస్ చూడడం. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ద్వారా విజన్ ప్రోలో ఫోటోలు, వీడియోలను 3డీలో చూసే వీలు కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు. అదనంగా, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ తో మీరు బహుళ విజువల్ స్క్రీన్ లపై ద్వారా క్రోమ్ ను ఉపయోగించవచ్చు. ఇది మల్టీటాస్కింగ్ ను సులభతరం చేస్తుంది. ఇక్కడ వాస్తవానికి, గూగుల్ మరియు AI కలిసి పనిచేస్తాయి. సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ లో కూడా లభిస్తాయి. ఇది ఒక సాధారణ సంజ్ఞ () తో మీ ముందు ఉన్న దాని గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.

గూగుల్ ప్లే లోని అన్ని యాప్స్ అందుబాటులో..

అంతేకాకుండా, గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ మొబైల్, టాబ్లెట్ యాప్స్ ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ కు అనుకూలంగా ఉంటాయని గూగుల్ హామీ ఇస్తుంది. అవి ఎలాంటి సమస్యలు లేకుండా నిరంతరాయంగా పనిచేసేలా చూస్తారు.

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఓఎస్ ప్రత్యేకంగా వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ల కోసం రూపొందించబడింది. కానీ ఇది వాటికి మాత్రమే పరిమితం కాదు. ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 16 స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లతో సహా దాదాపు అన్ని ఆండ్రాయిడ్ (android) మొబైల్ డివైజ్ ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మరో వ్యత్యాసం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ సరికొత్త ఓఎస్ కాగా, ఆండ్రాయిడ్ 15 అనేది సంవత్సరాలుగా అప్డేట్ చేయబడిన ఓఎస్. మరో ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ శామ్సంగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. కానీ, ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్ 16 పూర్తిగా గూగుల్ సొంత ఉత్పత్తులు.

మొదట హెడ్ సెట్ లలో..

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ మొదట హెడ్ సెట్ లలో అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మూహాన్ అనే కోడ్ నేమ్ తో ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ తో పనిచేసే తొలి డివైజ్ ను శాంసంగ్ (samsung) తయారు చేయనుంది. ఇది వచ్చే ఏడాది కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ తో పనిచేసే ప్రోటోటైప్ గ్లాసెస్ ను కూడా గూగుల్ పరీక్షిస్తోంది. ఆండ్రాయిడ్ ఎక్స్ ఆర్ పై పనిచేసే ప్రోటోటైప్ గ్లాసెస్ రియల్ వరల్డ్ టెస్టింగ్ ను ప్రారంభించనున్నట్లు గూగుల్ (GOOGLE) ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ తో నడిచే ఈ గ్లాసెస్ ఇతర ఆండ్రాయిడ్ డివైజ్లతో ఎలాంటి ఆటంకాలు లేని కనెక్టివిటీని అనుమతిస్తాయి.

తదుపరి వ్యాసం