Gold and silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- నేటి రేట్లు ఇవే..
Published Sep 06, 2024 06:23 AM IST
- Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు మరింత పడ్డాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,680కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,690గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,68,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,668గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,750కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,760గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,27,500గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,830గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,680 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,680గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,680గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,750గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,680గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,730గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,800గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,680గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,490గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84,900కి చేరింది. గురువారం ఈ ధర రూ. 85,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 89,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 84,900.. బెంగళూరులో రూ. 82,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 140 పెరిగి రూ. 25,540కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,400గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,540గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.