తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 24 Feb 2024 In Telugu States

Gold and silver prices today : స్థిరంగా పసిడి ధరలు, మరింత దిగొచ్చిన వెండి రేటు..

Sharath Chitturi HT Telugu

24 February 2024, 5:29 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు తగ్గాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 57,490గా ఉంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,74,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,749గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Gadgets under <span class='webrupee'>₹</span>699: ‘‘వర్క్ ఫ్రం హోం’’ చేస్తున్నారా?.. ఈ ఐదు గాడ్జెట్స్ చాలా యూజ్ ఫుల్

FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు లభించేది ఇక్కడే..; అత్యధికంగా 8.8 శాతం వరకు..

‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అల్టిమేటం

Motorola smartphone : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​.. ఫీచర్స్​ ఇవేనా?

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 62,720 వద్ద ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,27,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,272గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,640గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,870గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,490 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,720గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,210గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,490గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,720గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,490గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,720గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,540గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,770గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,490గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,720గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,440గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 74,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 74,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,400.. బెంగళూరులో రూ. 72,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 320 పెరిగి.. రూ 23,920కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,600గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,920గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)