తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X6 Neo 5g : 108 ఎంపీ మెయిన్ కెమెరాతో వచ్చే ఈ పోకో ఫోన్‌పై భారీగా తగ్గింపు.. ఆఫర్ చూసేయండి!

Poco X6 Neo 5g : 108 ఎంపీ మెయిన్ కెమెరాతో వచ్చే ఈ పోకో ఫోన్‌పై భారీగా తగ్గింపు.. ఆఫర్ చూసేయండి!

Anand Sai HT Telugu

Published Feb 19, 2025 10:44 AM IST

google News
  • Poco X6 Neo 5g : పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్‌ను మీరు తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్లతో క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు.

పోకో ఎక్స్6 నియో

పోకో ఎక్స్6 నియో

మీరు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోన్ కావాలని ఆలోచిస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ ఓఎంజీ సేల్‌లో మీకోసం బంపర్ డీల్ ఉంది. ఈ బిగ్ డీల్‌లో మీరు పోకో ఎక్స్6 నియో 5జీని గొప్ప ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఈ సేల్లో మీరు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999.

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ ధరను రూ.8,400 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. రూ.422 ప్రారంభ ఈఎంఐతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎక్స్6 నియో ఫీచర్లు

ఫోన్‌లో 6.67 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ లెవల్ 1000 నిట్స్. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం ఫోన్లో గొరిల్లా గ్లాస్ 5 లభిస్తుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ప్రాసెసర్ గా కంపెనీ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో అందిస్తోంది. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఈ ఫోన్లో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం

సెల్ఫీల కోసం ఈ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడవచ్చు. స్ట్రాంగ్ సౌండ్ కోసం ఇందులో డాల్బీ అట్మాస్ కూడా లభిస్తుంది.

తదుపరి వ్యాసం