తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మహా కుంభమేళాలో బ్రాండింగ్‌పై కంపెనీల ఫోకస్.. సుమారు రూ.3600 కోట్ల ఖర్చు!

మహా కుంభమేళాలో బ్రాండింగ్‌పై కంపెనీల ఫోకస్.. సుమారు రూ.3600 కోట్ల ఖర్చు!

Anand Sai HT Telugu

Published Jan 13, 2025 07:30 PM IST

google News
    • Mahakumbh Mela 2025 : మహా కుంభమేళా వైపు ప్రపంచం మెుత్తం చూస్తోంది. ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో కంపెనీలు సైతం తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లలో ఖర్చు పెడుతున్నాయి.
మహా కుంభమేళా 2025

మహా కుంభమేళా 2025

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 ప్రారంభమైంది. దీనికి దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భారతీయ కంపెనీలు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా చూస్తాయి. బ్యాంకింగ్ రంగం నుండి ఆహార పరిశ్రమ వరకు మార్కెటింగ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి.

ప్రచారానికి కోట్ల రూపాయలు

మహా కుంభమేళా సందర్భంగా ప్రకటనలు, మార్కెటింగ్‌కు కంపెనీలు దాదాపు రూ.3,600 కోట్లు వెచ్చిస్తున్నాయని అంచనాగా ఉంది. ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం బహిరంగ ప్రకటనలకు కేటాయించారు. స్నాన ఘట్టాల దగ్గర యాడ్స్ కనిపించేలా కంపెనీలు చర్యలు తీసుకున్నాయి.

మహా కుంభమేళా కోసం ప్రకటనల హక్కులను కలిగి ఉన్న క్రేయాన్స్ అడ్వర్టైజింగ్ చైర్మన్ కునాల్ లలానీ మాట్లాడుతూ.. కంపెనీలు బ్రాండ్‌లు ఎక్కువగా కనిపించేలా యాడ్స్ తయారు చేయించుకుంటున్నాయని చెప్పారు. కుంభమేళాలో మొత్తం బ్రాండింగ్ ఖర్చులో 70 శాతం స్నాన ఘట్టాల వద్ద ఖర్చు చేయడానికి దృష్టి పెడతారని తెలిపారు.

దిగ్గజ కంపెనీల ప్రమోషన్

కోకాకోలా, ఐటీసీ, అదానీ గ్రూప్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బిస్లరీ, పార్క్, ఇమామీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సందర్భంగా బ్రాండింగ్ హక్కులను పొందాయి. ఈ కంపెనీలు తమ బ్రాండ్ జనాల్లోకి ఎక్కువగా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.

అయితే సాధారణ పద్ధతిపైనే కాకుండా ఇతర విషయాల మీద కూడా కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సహాయాన్ని కూడా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా కంపెనీలు తమ విజిబిలిటీని పెంచుతున్నాయి. ఫిబ్రవరి 26 2025 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే వేడుకను బ్రాండింగ్ కోసం ఉపయోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి.

ఫోన్‌పే బీమా ప్లాన్

మరోవైపు మహా కుంభమేళాకు హాజరయ్యే వారి కోసం రూ.59 నుండి ప్రారంభమయ్యే బీమా ప్లాన్‌లను ఫోన్‌పే ప్రారంభించింది. ఫిబ్రవరి 25 2025 వరకు యాప్‌లో ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇతర ప్రయాణ సంబంధిత సమస్యలలో సహాయం చేయడానికి రూపొందించారు.

తదుపరి వ్యాసం