తెలుగు న్యూస్  /  బిజినెస్  /  7550ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, పవర్​ఫుల్​ ప్రాసెసర్​- ఫ్లిప్​కార్ట్​​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్​

7550ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, పవర్​ఫుల్​ ప్రాసెసర్​- ఫ్లిప్​కార్ట్​​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్​

Sharath Chitturi HT Telugu

Published Oct 11, 2025 09:10 AM IST

google News
  • ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్​లో స్మార్ట్​ఫోన్స్​పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి! రూ. 40,000 లోపే గెలాక్సీ ఎస్24, నథింగ్ ఫోన్ 3 లభ్యం అవుతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నథింగ్​ ఫోన్​ 3 (Aishwarya Panda-HT)

నథింగ్​ ఫోన్​ 3

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ మొదలైంది. ఈ పండుగ సీజన్‌లో స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా పండగే! 'బిగ్ బిలియన్ డేస్'లో బెస్ట్ ఆఫర్లను మిస్ అయిన వారికి, మంచి ధరలకు స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఇది మరో సువర్ణావకాశం! ఈ సేల్‌లో శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీల మోడల్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఆ వివరాలు కింద చూడండి..


ఫ్లిప్​కార్ట్​ సేల్​లో ఈ స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ డీల్స్​..

గెలాక్సీ S24-

శాంసంగ్ గెలాక్సీ S24 మోడల్‌ ఇప్పుడు కొత్త చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి, ఒరిజినల్​గా S24 లో ఎక్సీనోస్ 2400 చిప్‌సెట్ ఉండేది. కానీ, ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 3 చిప్‌తో వచ్చిన ఈ ఫోన్, పాత దాని కంటే అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బేస్ మోడల్ (128GB + 8GB) ధర రూ. 39,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లను జోడిస్తే, ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

పోకో ఎఫ్​7 5జీ-

తరువాత చెప్పుకోవాల్సిన మోడల్ పోకో ఎఫ్​7 5జీ. దీని ధర రూ. 30,999. ఎక్స్​ఛేంజ్ ఆఫర్లను కలుపుకుంటే ఈ ధర మరింత తగ్గుతుంది. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి:

బ్యాటరీ: భారీ 7,550ఎంఏహెచ్​ బ్యాటరీ.

ర్యామ్ అండ్​ స్టోరేజ్: 12GB ర్యామ్​- 256GB స్టోరేజ్.

ప్రాసెసర్: శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 4 చిప్‌సెట్.

కెమెరా: 50ఎంపీ ప్రధాన కెమెరా.

డిజైన్: ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్.

నథింగ్ ఫోన్ 3-

నథింగ్ ఫోన్ 3 ప్రారంభంలో భారతదేశంలో ఏకంగా రూ. 80,000 ధరతో విడుదలైంది. ధర ఎక్కువ కావడంతో చాలా మంది దీనిని కొనడానికి వెనుకాడారు. అయితే, ప్రస్తుతం ఇది మెరుగైన ధరకు లభిస్తోంది! ఎక్స్​ఛేంజ్​, బ్యాంక్ డిస్కౌంట్‌లను కలిపి చూస్తే, ఈ ఫోన్ రూ. 40,000 కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, విలక్షణమైన డిజైన్, క్లీన్ నథింగ్ ఓఎస్​ యూఐ, స్నాప్‌డ్రాగన్ 8ఎస్​ జెన్​ 4 చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ డీల్‌తో ఈ ఫోన్ చాలా మంచి విలువను అందిస్తుంది.

సీఎంఎఫ్​ ఫోన్ 2 ప్రో-

మీరు తక్కువ ధరలో మంచి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, సీఎంఎఫ్​ ఫోన్ 2 ప్రో మంచి ఎంపిక! బేస్ మోడల్ ధర రూ. 14,999గా ఉంది. భారత్‌లో దీని లాంచ్ ధర రూ. 18,999 గా ఉండేది. అంటే, ఈ సేల్‌లో మీరు చెప్పుకోదగ్గ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

మరి మీరు ఏ స్మార్ట్​ఫోన్​ని ఎంచుకుంటారు?