FD interest rates: ఒక ఏడాది కాలపరిమితి గల ఎఫ్డీలపై అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంక్ లు ఇవే
16 November 2024, 16:14 IST
FD interest rates: రెగ్యులర్ గా ఆదాయం అందించే సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి. వేర్వేరు కాలపరిమితుల ఎఫ్ డీలకు వేర్వేరు వడ్డీ రేట్లను బ్యాంక్ లు అందిస్తుంటాయి. ఒక ఏడాది కాలపరిమితి గల ఎఫ్ డీ లపై అత్యధిక వడ్డీని అందిస్తున్న బ్యాంక్ ల వివరాలు మీ కోసం..
Banks typically offer lower interest rates on short term FDs, and higher interest on long term fixed deposits
FD interest rates: ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఖాతాను తెరవడానికి ముందు, డిపాజిటర్లు సాధారణంగా వారి ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చుకుంటారు. వివిధ బ్యాంక్ లు సాధారణంగా స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లను, దీర్ఘకాలిక డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. అంటే మూడేళ్లు లేదా ఐదేళ్ల ఎఫ్డీపై ఇచ్చే వడ్డీ సాధారణంగా ఏడాది ఎఫ్డీపై ఇచ్చే వడ్డీ (bank interest rates) కంటే ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఏడాది కాలపరిమితిని మించి ఎఫ్ డీ ల్లో డబ్బులు పెట్టే ఆసక్తి, అవకాశం ఉండదు. అలాంటి వారి కోసం ఏడాది కాలపరిమితి గల ఎఫ్డీలపై అత్యధిక వడ్డీని అందిస్తున్న బ్యాంక్ ల జాబితా మీకు అందిస్తున్నాం..
ఎఫ్డీలపై అత్యధిక వడ్డీని అందిస్తున్న 7 బ్యాంక్ లు
హెచ్డిఎఫ్సి బ్యాంక్: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC BANK) జూలై 24, 2024 నుండి అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ పై సాధారణ పౌరులకు 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ (ICICI BANK) ఏడాది నుంచి 15 నెలల కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై సాధారణ పౌరులకు 6.7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీని అందిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది సాధారణ పౌరులకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.6 శాతం వడ్డీని (fixed deposit rates) జూన్ 14 నుండి అందిస్తుంది.
ఫెడరల్ బ్యాంక్: అక్టోబర్ 16 నుంచి ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): జూన్ 15 నుండి అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 6.8 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): అక్టోబర్ 1 నుండి ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీని అందిస్తుంది.
కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.85 శాతం, ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్ తో మాట్లాడండి.